Friday, March 29, 2024
- Advertisement -

ఆ రోజు పవన్ ఎందుకు అలా నవ్వాడో తెలుస్తే షాక్ అవుతారు

- Advertisement -
Here Is The Reason Why Pawan Laugh On That Day

‘కాటమరాయుడు’ ఆడియో పంక్షన్ లో నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతుంటే సమయంలో.. ఆలీ ఏదో అనడం తో.. పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తుళ్లిపడుతూ పగలబడి నవ్వడం అందరి దృష్టినీ ఆకర్షించింది. పవన్ ఆ రోజు ఎందుకలా నవ్వాడని ఎవ్వరికీ అర్థం కాలేదు. ఈ సంగితిలో ఎవరికి తోచింది వాళ్లు ఊహించుకున్నారు. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ కూడా నడిచింది.

పవన్ అలా గెంతుతూ నవ్వడం భలే సరదాగా అనిపించింది అందరికీ. ఆలీ ఏదో బూతు జోక్ వేసి ఉంటాడని.. అందుకే పవన్ అలా నవ్వి ఉంటాడని చాలామంది అన్నారు. ఐతే ఆ రోజు అసలేం జరిగింది.. పవన్ ఎందుకు అంతలా నవ్వాడో ఆలీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘పవన్ నవ్వు అభిమానుల్లో అంత చర్చకు దారి తీస్తుందని ఊహించలేదు. ఆ రోజు శరత్ మరార్ గారు పవన్ కళ్యాణ్‌ను అదే పనిగా పొగిడారు. ఆయన డ్రెస్సింగ్.. లుక్ గురించి మాట్లాడారు. నేను ఉన్నట్లుండి.. ‘మళ్లీ పెళ్లి గానీ చేస్తాడా ఏంటి’ అన్నాను. పవన్ అది విన్నాడు.

నవ్వు ఆపుకోలేకపోయాడు’’ అంటూ అసలు విషయం వెల్లడించాడు ఆలీ. పవన్‌కు ఆలీ అంటే చాలా ఇష్టం. అతడితో అనుబంధం గురించి పవన్ చాలాసార్లు ప్రస్తావించాడు. పవన్ దగ్గర ఏదైనా మాట్లాడగలిగే.. అతడి మీద జోకులు కూడా వేయగలిగేంత చనువు ఆలీకి ఉంది. ‘మళ్లీ పెళ్లా’ అంటూ పవన్ ముందే అతడి మీద జోక్ పేల్చగలిగాడంటే ఆలీ పవన్‌కు ఎంత క్లోజో అర్థం అవుతుంది.

{youtube}to3S1jaOT5M{/youtube}

{youtube}CAx3o5yzEAQ{/youtube}

Related

  1. పవన్ ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలుసా..?
  2. పవన్ పై సంచలన కామెంట్ చేసిన రామ్ చరణ్
  3. పవన్ పద్ధతి పై జగన్ సంచలన వ్యాఖ్యలు
  4. ఊహించని రెంజ్ లో పవన్ రెమ్యునరేషన్.. ఎంతంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -