Thursday, April 25, 2024
- Advertisement -

తండ్రిలా సాకారు.. తండ్రిలా నిలిచారు.. పవన్ భావోద్వేగ లేఖ..!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వరుసగా మెగా బాస్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య బర్త్ డే సందర్భంగా ఎంతో భావోద్వేగంతో రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది.

‘చిరంజీవి నాకే కాదు అందరికీ మార్గదర్శి, చిరంజీవి నాకే కాదు ఎందరికో స్ఫూర్తి ప్రదాత, చిరంజీవి నాకే కాదు ఎందరికో ఆదర్శప్రాయుడు… ఇలా చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకున్న కొన్ని మిగిలే ఉంటాయి. ఆయన తమ్ముడి గా పుట్టడం ఒక అదృష్టం అయితే..ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను అభిమానించి ఆరాధించే లక్షలాది అభిమానుల్లో నేను తొలి అభిమానిని. ఆయనను చూస్తూ.. ఆయన సినిమాలను వీక్షిస్తూ..ఆయన ఉన్నతిని కనులారా చూశాను.

ఒక అసామాన్యుడిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనకు అద్భుత లక్షణం భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నా.. తెలుగు సినిమాలు భారత చలన చిత్ర రంగంలో అగ్ర పథాన నిలబెట్టినా.. అవార్డులు రివార్డులు ఎన్ని వరించినా.. నందులు తరలివచ్చినా.. పద్మభూషణ్ కీర్తి గడించినా.. చట్ట సభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పదవులను అలంకరించిన ఆయన తల ఎగరేయలేదు. విజయాలు సాధించినా.. రికార్డులు సృష్టించినా.. అదే విధేయత..అదే వినమ్రత చిరంజీవి గారి సొంతం.

అందువల్లే ఆయనను సొంత మనుషిలా భావిస్తారు లక్షలాది మంది. విద్యార్థి దశలో సేవాభావాన్ని పెంపొందించుకున్న చిరంజీవి గారు నాడు రక్త నిధి, నేడు ప్రాణవాయువు నిధి స్థాపించి కొడిగడుతున్న ప్రాణాలకు ఆయువు నిస్తూ తనలోని సేవాగుణం ద్విగుణీకృతం చేసుకున్నారు. ఆపదలో ఎవరైనా ఉన్నారంటే ఆదుకోవడంలో ముందుంటారు. దానాలు, గుప్తదానాలు ఎన్నో చేశారు.. చేస్తూనే ఉన్నారు.

పనుల్లేక అల్లాడిపోయిన సినీ కార్మికుల ఆకలి తీర్చడానికి ఎంతో తపన పడ్డారు కార్మికులు అందరూ చిరంజీవి గారిని తమ నాయకునిగా ఆరాధిస్తున్నారు. ఆయన జీవితాన్ని లిఖిస్తున్నారు.చిరంజీవి గారు మా కుటుంబంలో అన్నగా పుట్టి మమ్మల్ని తండ్రిలా సాకారు.. తండ్రి స్థానంలో నిలిచారు. ఆ ప్రేమ మూర్తి పుట్టినరోజు సందర్భంగా ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవికి ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు ప్రసాదించాలని చిరాయువు తో చిరంజీవి గా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.’ అని పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో లేఖ రాశారు. ఈ లేఖ మెగా ఫ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ న్యూస్.. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -