Friday, March 29, 2024
- Advertisement -

ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ న్యూస్.. ఒకే రోజు నాలుగు సినిమాల అప్డేట్స్.. ఎప్పుడంటే..!

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేస్తుండడంతో ఆయన నుంచి వస్తున్న సినిమాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తమ హీరో కొత్త సినిమాల విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వారి ఎదురుచూపులు ఫలించనున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ వరుసగా నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే వచ్చింది. రాధే శ్యామ్ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుండటంతో సెప్టెంబర్ నుంచి ఆ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు.

అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాధే శ్యామ్ టీజర్ విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కాకుండా ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే ( వర్కింగ్ టైటిల్) సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాధే శ్యామ్ టీజర్ తో పాటు.. ఈ మూడు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. ఒకేరోజు ప్రభాస్ నటిస్తున్న నాలుగు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రానుండడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆ రోజుకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Also Read: సుకుమార్, మహేష్ మధ్యే మనస్పర్థలు తొలగినట్టేనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -