కాటమరాయుడు కోసం పవన్ ఏం చేస్తున్నాడంటే?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ జిమ్ లో తెగ కష్టపడుతున్నాడు. డాలీ దర్శకత్వంలో పవన్ కాటమరాయుడు అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రాజకీయాలతో పూర్తిగా బిజీ గా ఉన్న పవన్ ప్రస్తుతం రాజకీయాలను పక్కన పెట్టి తన కాటమరాయుడు సినిమా షూటింగ్ పనిలో పడ్డాడు.

శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎల్లుండి నుండి జరుపుకోనుంది. పవన్ మాత్రం ఈనెల 24 నుంచి షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఆ పాత్రకు తగ్గట్లుగా ఫిట్ నెస్ కోసం జిమ్ లో కష్టపడుతున్నాడు పవన్. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్ గా పవన్ సరసన నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి విజయదశమి కానుకగా తాజా లుక్‌ని విడుదల చేస్తారట. వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

Related

  1. పవన్ కళ్యాణ్ అర్ధం చేసుకో
  2. నేను పెట్టిన టీ అంటే పవన్ కళ్యాణ్ కి ప్రాణం – రేణూ దేశాయ్
  3. సూపర్ .. మళ్ళీ హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చిత్రం !
  4. 200 కోట్లు ఇస్తా అంటే ఒద్దన్న పవన్ కళ్యాణ్ !