Tuesday, April 16, 2024
- Advertisement -

ఆచార్య విడుదలపై అంతా గందరగోళం..!

- Advertisement -

కరోనా ప్రభావం తగ్గిపోతుండటంతో ఆగస్టులో 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ చేస్తారనే టాక్ నడుస్తోంది. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు, చిత్రీకరణ తుది దశలో ఉన్న సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. వరుసగా డేట్లు ప్రకటిస్తున్నారు. ఖిలాడి, నారప్ప, లవ్ స్టోరీ, టక్ జగదీశ్ థియేటర్లు ఓపెన్ అవగానే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా వినాయక చవితి కానుకగా విడుదల కానుంది.

ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను నెల రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆదిపురుష్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. నితిన్ ఇటీవలే మాస్ట్రో షూటింగ్ కంప్లీట్ చేశాడు. మహేష్ సర్కార్ వారి పాట, పవన్ మలయాళ రీమేక్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నాయి.రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే మొదలవగా ఎన్టీఆర్,రామ్ చరణ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

ఇలా అన్ని సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ వరుసగా విడుదలకు సిద్ధమవుతుండగా ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభం పై ఎటువంటి టాక్ రావడం లేదు. చిరంజీవి తన తర్వాత సినిమా లూసిఫర్ లుక్ లో కనిపిస్తుండగా, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ కోసం అల్లూరి గెటప్ లోకి మారారు. దీంతో ఇప్పటికిప్పుడు ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభం కాదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. చిత్రీకరణ లేటవుతుండడంతో అసలు ఈ సినిమా దసరా రేసులో నిలుస్తుందా లేదా అని అభిమానుల్లో గందరగోళం నెలకొంది.

Also Read

ఇంగ్లీష్​లో డబ్​ అయిన తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

జీవితకు.. బాలయ్య సపోర్ట్​? మా ఎన్నికలు మరింత హీట్​..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -