Saturday, April 27, 2024
- Advertisement -

బిగ్ బాస్ షోకు పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఆ సీనే లేదంటున్న బ్యూటీ?

- Advertisement -

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. అత్యధిక ప్రేక్షకాదరణ పొందడంతో బిగ్ బాస్ రియాలిటీ షో ను తెలుగు, హిందీ ,కన్నడ, తమిళ, మలయాళం భాషలలో ప్రసారం చేస్తున్నారు. ప్రతి ఒక్క భాషలో కూడా బిగ్ బాస్ కేవలం ఒక సీజన్ కి పరిమితం కాకుండా పలు సీజన్లలో దూసుకుపోతోంది.బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లో చాలామంది మంచి అవకాశాలు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌ కోసం కంటెస్టెంట్ గా స్టార్ హీరోయిన్ భూమికను సంప్రదిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్ భూమిక స్పందిస్తూ తాను బిగ్‌బాస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కావాలనే ఈ విషయాన్ని ఎవరో వైరల్ చేస్తున్నారని మండిపడుతూ ఒకవేళ షో కోసం నన్ను సంప్రదించినా నేను వెళ్లడానికి సిద్ధంగా లేను అంటూ తెగేసి చెప్పేసింది. అయితే గతంలో హిందీ బిగ్ బాస్ పలు సీజన్లకు సంప్రదించిన మాట వాస్తవమే. కానీ అప్పుడు కూడా నేను అంగీకరించలేదు. 24 గంటలు కెమెరా ముందే ఉండటం నాకు ఇష్టం ఉండదు అంటూ చెప్పుకొచ్చింది.

Also read:వీలైనంత వరకు మాంసం తగ్గించండి అంటున్న.. స్టార్ హీరోయిన్?

తెలుగులో” ఖుషి “సినిమాతో స్టార్డమ్ అందుకున్న భూమిక పలు విజయవంతమైన సినిమాల్లో నటించి అగ్రకథానాయికగా కొనసాగింది. ఇటీవలే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నాని నటించిన MCA మూవీలో నటించింది. ఆ తర్వాత సవ్యసాచి, రూలర్‌ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా గోపీచంద్ హీరోగా నటించిన సీటీమార్‌ మూవీలో అలాగే ఇది మా కథ, పాగల్‌ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

Also read:ప్రేమకు వయసుతో పనిలేదు.. అది కేవలం నెంబర్ మాత్రమే: నటి సురేఖ వాణి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -