Saturday, May 4, 2024
- Advertisement -

అక్కడ సినిమా షూటింగ్స్ కి పరిమిషన్

- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. సెకండ్ వేవ్ ధాటికి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.. అవుతున్నారు. ఒక్కరోజు నాలుగు లక్షల కేసులు నమోదు అయ్యాయంటే కరోనా ఉధృతి ఎంతగా ఉందో అర్థం అవుతుంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేశాయి. ఈ నేపథ్యంలో వెండితెర, బుల్లితెర షూటింగ్స్ వాయిదా పడ్డాయి. తొలుత మ‌హారాష్ట్రలో చిత్రీక‌ర‌ణ నిలిచిపోయాయి.

ప్రస్తుతం అక్కడ కరోనా చాలా వరకు కంట్రోల్ అయ్యింది. దాంతో సినిమా షూటింగ్‌లకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సినిమా, టెలివిజన్‌ షూటింగ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ని పూర్తిగా ఎత్తివేసింది. అక్కడ థియేటర్లలో సినిమా ప్రదర్శనలకీ అనుమతులు ఇచ్చింది. ఈ నెల 7 నుంచే బాలీవుడ్‌ వర్గాలు చిత్రీకరణలకి సిద్ధం అవుతున్నాయి.

ఆదివారం చిత్ర పరిశ్రమ, టెలివిజన్‌ పరిశ్రమవర్గాల ప్రతినిధులతో వర్చువల్‌గా జరిగిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు. పరిశ్రమకు చెందిన ఆదేశ్‌ బందేకర్‌, నితిన్‌ వైద్య, ప్రశాంత్‌ దాల్మి, భరత్‌జాదవ్‌, సిద్ధార్థ్‌రాయ్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చింది. అన్‌లాక్‌ ప్రక్రియలో నిబంధనల మేరకు భాగంగా షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నాం అని పేర్కొన్నారు.

ఆసుప‌త్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్!

ప్రేమకు వయసుతో పనిలేదు.. అది కేవలం నెంబర్ మాత్రమే: నటి సురేఖ వాణి

బిగ్ బాస్ కి నో చెప్పిన పవన్ హీరోయిన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -