Friday, April 19, 2024
- Advertisement -

ప్రేమకు వయసుతో పనిలేదు.. అది కేవలం నెంబర్ మాత్రమే: నటి సురేఖ వాణి

- Advertisement -

సురేఖ వాణి చక్కటి అందం, అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.సురేఖావాణికి ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరై హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ను కూడగట్టుకుంది. అలాగే సురేఖవాణి గారాల కూతురు సుప్రితకు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.

సురేఖా వాణి నిత్యం ఏదో రకమైన పోస్టులతో సోషల్ మీడియాను ఉపేస్తోంది.ఇటీవలే చిలకపచ్చ చీరలో సురేఖ వాణి, ఎరుపు రంగు చీరలో సుప్రీత తీన్మార్ స్టెప్పులతో సోషల్ మీడియాని ఉర్రూతలూగించిన విషయం మరవకముందే. తాజాగా సురేఖ వాణి ప్రేమించడానికి వయసుతో పని ఏముంది వయస్సు అనేది ప్రేమలో ఒక నెంబర్ మాత్రమేనని, ప్రేమకు వయసు అడ్డురాదని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.

Also read:ఆ సినిమా తర్వాత మరోసారి జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా?

అలాగే దానిని ఉదాహరిస్తూ తన కంటే తక్కువ వయసున్న అబ్బాయిలను వివాహం చేసుకుంటున్న నలుగురు జంటల ఫోటోలను పోస్ట్ చేసింది.ప్రియాంక చోప్రా నిక్ జోనస్ తో పాటు మరో మూడు హాలీవుడ్ జంటలను ఆమె పోస్ట్ చేసింది.దీంతో 40 సంవత్సరాలు దాటిన సురేఖ వాణి రెండో పెళ్లి గురించి చర్చ జరిగినప్పుడు ఆమె స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. రెండో వివాహం చేసుకోవడం తప్పేమీ కాదని కాకపోతే తాను మాత్రం ఇప్పట్లో చేసుకోలేమని చెప్పుకొచ్చింది. ఒకవేళ వివాహం చేసుకుంటే చిన్న వయసు వాడిని చేసుకుంటుందా అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Also read:40 ఏళ్ళ వయసులో ప్రేమలో పడిన సీనియర్ నటి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -