పవన్ కు ట్విట్టర్ లో 1 మిలియన్ ఫాలోవర్లు!

Pawan kalyan On Twitter

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన “ఒక్కోసారి రావడం లేటవుతుంది కాని.. రావడం మాత్రం పక్కా” డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ డైలాగ్ ను తన నిజ జీవితంలో నిజం చేస్తున్నాడు. హిట్ కొట్టడంలో అయిన.. కొత్తగా రాజకీయ పార్టీలు పెట్టడం అయిన… రావడం లేటైంది కాని.. రావడం మాత్రం పక్కా అన్న విధంగా చేస్తున్నాడు పవన్.

ఇప్పుడు ఈ కోవలోనే మరో విషయం జరిగింది. అప్పట్లో యాంకర్ సుమకు ఇచ్చిన ఓ ఇంటర్వూ లో పవన్.. ట్విట్టర్ లో ఏముంది.. రోజూ తిన్నావా.. టిఫిన్ చేశావా అంటూ అప్డేట్లు పెట్టడం తప్పించి.. అంటూ కామెంట్ చేశాడు. కానీ.. పవన్ తన అభిప్రాయాన్ని మార్చుకొని ట్విట్టర్లోకి వచ్చాడు.

ఇప్పుడు ఏకంగా 1 మిలియన్ ఫాలోవర్లను దక్కించుకున్నాడు. మాములుగా అసలు పవన్ కళ్యాణ్ చాలా తక్కువగా మాట్లాడుతాడు. ఇక తన ట్వీట్లు కూడా కేవలం తన రాజకీయ ప్రయాణంలో ప్రజల కోసం తను అడగాల్సిన ప్రశ్నలనే ఎక్కువగా సంధిస్తుంటాడు. అందుకే ఆయన 1 మిలియన్ ఫాలోవర్స్ అనే విషయాన్ని కూడా ప్రచారం చేయడు. కాకపోతే ఫ్యాన్స్ ఉరుకోరుగా.. వారు మాత్రం ఎప్పుడులాగే పండగ చేసుకుంటున్నారు.

Related

  1. పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ పట్టించుకోలేదా? కారణం ఇదేనా?
  2. పవన్ కళ్యాణ్ కి నటన నేర్పినందుకు అంతా ఇచ్చారా?
  3. పవన్ ఇక సినిమాలు చేయడా?
  4. పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన నయనతార!