Thursday, April 18, 2024
- Advertisement -

ఆమెను చూసే పోల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నా: పాయల్

- Advertisement -

సోషల్ మీడియా వేదికగా వీలైనప్పుడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది హాట్ బ్యూటీ పాయల్ ఘోష్. ఈమె మంచు మనోజ్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన “ప్రయాణం” సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన”ఊసరవెల్లి” సినిమాలో అవకాశం దక్కించుకుంది. తరువాత మిస్టర్ రాస్కెల్ ఈ సినిమాతో తెలుగు తెరపై చివరిసారిగా కనిపించింది.

ప్రస్తుతం పాయల్ ఘోష్ “న్యూయార్క్ టు హరిద్వార్” అనే సినిమాతో మరోసారి వెండితెరపై కనిపించనుంది. అలాగే ఈ సినిమా కోసం పాయల్ ఘోష్ ప్రత్యేకంగా పోల్‌ డ్యాన్స్ నేర్చుకుంటోంది. ఎందుకంటే ఈ మూవీలో పాయల్ ఘోష్ పోల్‌ డ్యాన్స్‌చేయాల్సిన సాంగ్ ఒకటి ఉంది. పైగా తనకు ఇష్టమైన డాన్స్ కావడంతో మరిన్ని మెలకువలు నేర్చుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తోందట.

Also read:రకుల్ ప్రీత్ వంట.. వీడియో తీసి మరి పరువు తీసిన తమ్ముడు!

పోల్‌డ్యాన్స్ నేర్చుకోవడానికి హాలీవుడ్‌ నటి జెన్నిఫర్ లోఫెజ్‌ నటించిన హస్ట్లర్స్ మూవీ, ఇంకా చార్లీ ఏంజిల్స్,ఫెంటాస్టిక్ ఫోర్ వంటి చిత్రాలను చూసి కొంత తెలుసుకున్నా. అలాగే కామెరాన్ దియాజ్, జెస్సికా అల్బాల స్టంట్స్ నుంచి కూడా ఎంతో ప్రేరణ పొందాను. లాక్ డౌన్ సమయంలో నాకు ఇవన్నీ చూడడానికి, నేర్చుకోవడానికి వీలైనంత సమయం దొరికింది.
అలాగే మీరు కూడా ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకుని మీకు ఇష్టమైన వాటిని నేర్చుకుంటూ ఇంటికే పరిమితమవ్వడం చాలా ముఖ్యం. అలాగే కరోనా నియమాలు పాటించి జాగ్రత్తగా ఉండండి అంటూ నటి అభిమానులకు సూచించారు.

Also read:భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన స్టార్ హీరోలు.. ఒక్క సినిమాకు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -