Thursday, April 18, 2024
- Advertisement -

#PSPK28 పవర్ స్టార్ కి జోడిగా సామ్..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జోరుమీద ఉన్నాడు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఆయన వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ విడుదలై ఘనవిజయం సాధించగా, హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ సెట్స్ పై ఉన్నాయి. కరోనా లాక్డౌన్ లేకపోతే ఈ రెండు సినిమాలు కూడా ఈ పాటికే షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. కాగా ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తయిన తర్వాత అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న హరీష్ శంకర్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని చేయనున్నాడు పవన్.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో మేకర్ సంప్రదింపులు జరిపారట. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఒకే సినిమాలో నటిస్తున్నందున డేట్స్ ఇవ్వడానికి కూడా సమస్య లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సమంత ది హిట్ జోడి. ఇదివరకే వీరిద్దరూ అత్తారింటికి దారేది సినిమాలో నటించి మంచి పెయిర్ అనిపించుకున్నారు.

Also Read: చందమామ కోసం సీనియర్ల క్యూ.. పెళ్లి తర్వాత కూడా జోరు తగ్గట్లే..!

ఇప్పుడు మరోసారి ఈ జంట తెరపై కనిపించనుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా సమంత ఇదివరకే ఓ సినిమాలో నటించింది. ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన రామయ్యా వస్తావయ్యా సినిమాలో సమంతనే హీరోయిన్. సమంత నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మెన్ -2 ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో మెయిన్ లీడ్ పాత్రలో సమంత నటిస్తోంది.

Also Read: హీరో చేంజ్.. మహేష్ కథలోకి పవన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -