ఆర్ఎక్స్ 100 సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన రాజ్‌పుత్ పాయల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.అసలు సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడంలో ఆమెదే ప్రముఖ పాత్ర అని చెప్పాలి.ఆమె అందాలకు యూత్ ఫిదా అయ్యారు.ట్రైలర్,టీజర్‌లో ఆమె చూపించిన గ్లామర్ షోకి థియోటర్‌కు క్యూ కట్టారు యువత.అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు..నేను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పుకొచ్చింది.
ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత రాజ్‌పుత్ పాయల్‌కు వరస ఆఫర్లు వస్తున్నాయటా,ఈ క్రమంలోనే ఓ నిర్మాత నీకు అవకాశం ఇస్తాను,మరి నాకేంటి కమిట్మెంట్ ఇస్తావా అని అడిగాడటా ఆ నిర్మాత.కోపంతో వెంటనే అక్కడి నుండి వచ్చేశానని తెలిపింది ఈ భామ.కాస్తా గ్లామర్ పాత్రలు చేస్తే అలాంటి దృష్టితో ఎలా చూస్తారని ప్రశ్నించింది.నేను మధ్యతరగతి పుట్టి పెరిగాను,నాకు ఆత్మభినమానం ఎక్కువ.అలాంటి తప్పుడు పనులు ఎప్పటికి చేయనని చెప్పుకొచ్చింది రాజ్‌పుత్.