Friday, May 10, 2024
- Advertisement -

పవన్ కోసం బాబు కాంప్రమైజ్ కావాల్సిందే..!

- Advertisement -

జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మద్య రహస్య సంభందం ఉందని, వైసీపీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పొత్తుల విషయంలో అటు పవన్ గాని, ఇటు చంద్రబాబు గాని బహిర్గతం కాలేదు. కానీ ఆ మద్య విశాఖ ఘటన తరువాత పవన్ కు సంఘీభవం తెలిపేందుకు చంద్రబాబు హిటాహుటిన పవన్ తో బేటీ అయ్యారు. ఈ బేటీతో టీడీపీ జనసేన మద్య నిజంగానే పొత్తు కుదిరిందనే వార్తలు వచ్చాయి. కానీ ఆ మద్య విశాఖ వచ్చిన మోడితో పవన్ భేటీ అనంతరం ఒక్క ఛాన్స్ నినాదం అందుకొని.. పొత్తు విషయంలో టీడీపీని డైలమాలో పడేశారు జనసేన అధినేత. దాంతో ఇక టీడీపీతో పవన్ కలసే అవకాశం లేదని భావించిన చంద్రబాబు చివరి ఛాన్స్ అంటూ సరికొత్త నినాదాన్ని అందుకున్నారు..

ఇక టీడీపీకి వచ్చే ఎన్నికలు డూ ఆర్ డై లాంటివి. తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎలాంటి పొత్తు లేకుండా టీడీపీ స్వతహాగా బరిలోకి దిగితే గెలుపు కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జనసేనను కలుపుకునే ప్రయత్నం చేసిన.. ప్రస్తుతం పవన్ సి‌ఎం పదవే టార్గెట్ గా ముందుకు సాగుతున్నారు. దాంతో పవన్ను ఏ మాత్రం కలుపుకునే ప్రయత్నం సి‌ఎం అభ్యర్థిగా పవన్ తానే ఉండాలని కోరే అవకాశం ఉంది. దానికి బాబు ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే.. తనకు ఇవే చివరి ఎన్నికలు అని ముందుకు వెలుతున్న బాబు.. సి‌ఎం అభ్యర్థిగా తాను కాకుండా వేరే వాళ్ళను ఊహించుకోలేరు.

అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటే చంద్రబాబు కచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సిందేనని విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. పవన్ కూడా ఈ విషయాన్ని పదే పదే నొక్కి చెబుతున్నారు. గతంలో ఎలాంటి పదవులు ఆశించకుండా మద్దతు ప్రకటించానని, ఈసారి మాత్రం తగ్గేదేలే లేదంటూ పవన్ చెప్పకనే చెబుతున్నారు. దాంతో చంద్రబాబు చేసేదేమీ లేక ప్రస్తుతం ఒంటరిగానే పోరాటం చేసేందుకు సిద్దమయ్యారు. అయితే అటు జనసేన, ఇటు టీడీపీ రెండు పార్టీల లక్ష్యం ఒక్కటే. వైసీపీ సర్కార్ ను పడగొట్టడం.. మరి ఈ రెండు పార్టీలు ఒక్క తాటిపైకి రావాలంటే ఇద్దరు అధినేతలలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాల్సిందే. ఒకవేళ ముఖ్యమంత్రి ఆభ్యర్థిగా పవన్ కు చంద్రబాబు మద్దతు పలికితే వైసీపీ గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. మరి ఎన్నికల నాటికి పవన్, చంద్రబాబు ఎలాంటి ప్రణాళికలతో సాగుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి

కే‌సి‌ఆర్ చుట్టూ బిగుస్తున్నా ఉచ్చు.. !

పార్లమెంట్ కు రాహుల్ నో.. జోడో వైపే మొగ్గు !

సీమగర్జన.. మరో విశాఖగర్జన అవుతుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -