Monday, May 6, 2024
- Advertisement -

సాయం చేయండంటూ వేడుకుంటున్న పాయల్ రాజపుత్.. ఎందుకంటే?

- Advertisement -

పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా కుర్రకారు మతి పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుల మతి పోగొడుతుంది. పాయల్ సోషల్ మీడియాలో తన ప్రియుడు సౌరబ్ థింగ్రాతో కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు. పాయల్ ఏ సినిమా షూటింగ్ కి వెళ్ళినా అక్కడ తన ప్రియుడు కూడా వాలిపోతాడు.

షూటింగ్ ప్రదేశంలో ఇద్దరూ ఒకే రూమ్ తీసుకోని మీరు చేసే రచ్చ మామూలుగా ఉండదు.ఈ క్రమంలోనే పాయల్ తన ప్రియుడితో చేసే వీడియోలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా పాయల్ సోషల్ మీడియా ద్వారా సహాయం చేయండి అని వేడుకోవడంతో ఏదో జరగరానిది జరిగిందని నెటిజన్లు భావిస్తున్నారు.

పాయల్ ప్రియుడు సౌరభ్ థింగ్రా తల్లి అనితా థింగ్రా అనారోగ్యానికి గురి కావడంతో ఈమె తెగ ఆందోళన చెందుతున్నారు.ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి ప్లీజ్ అంటూ పాయల్ చేసిన పోస్టులు అందరిని కదిలిస్తున్నాయి. ప్రార్థనలు అద్భుతాలను సృష్టిస్తాయి. ఆమె కోసం ప్రార్థించండి.. దేవుడా దయచేసి అలా చేయకు.. అని పాయల్ ఎమోషనల్ అయ్యారు.

Also read:సోనూ సూద్ ఫౌండేషన్ కు సారా అలీఖాన్ భారీ విరాళం.. ఎంతంటే?

ఇక తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సోనపేట్ ఏరియాలో ఓ వెంటిలేటర్ బెడ్, అంబులెన్స్ అవసరం ఉంది.. ఎవరైనా ఉంటే సాయం చేయండి అని పాయల్ సోషల్ మీడియా ద్వారా వేడుకోవడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఆమె కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది.

Also read:అనుపమ రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ చిత్రాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -