Thursday, May 2, 2024
- Advertisement -

ఉప్పెన దర్శకుడికి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఇప్పట్లో కష్టమే?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఎంతో పేరును సంపాదించుకున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్ఆర్ఆర్”చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు, టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా చేయనున్నాడని సమాచారం వినిపించింది.

కొన్ని అనుకోని కారణాలవల్ల ఎన్టీఆర్ 30వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కాకుండా కొరటాల కాంబినేషన్లో తెరకెక్కనున్న ఇదివరకే ప్రకటించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరొక దర్శకుడితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.ఆ దర్శకుడు మరెవరో కాదు ఉప్పెన సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన బుచ్చిబాబుతో ఎన్టీఆర్ సినిమా చేయనున్నట్లు సమాచారం.

Also read:అనుపమ రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ చిత్రాలు ఇవే!

తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబినేషన్లో సినిమా ఓకే అయినప్పటికీ ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బుచ్చిబాబుకి స్క్రిప్ట్ కి ఓకే చెప్పాడు కానీ, ఆ సినిమా ఎప్పుడు చేయాలనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కనుక బుజ్జి బాబు ఎన్టీఆర్ కోసం వెయిటింగ్ మోడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో బుచ్చిబాబు రెండవ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

Also read:‘టాలీవుడ్’లో ఎవర్ గ్రీన్ ప్రేమ కథ చిత్రాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -