ప్రముఖ ఒరియా నటి సిమ్రన్ సింగ్ మృతి చెందారు. ఆమె శవం మహానది ఒడ్డున దొరికింది. ఆమె శరీరంపై చాలా గాయాలు ఉన్నాయాని తెలుస్తుంది. తల, ముఖంపై గాయాలు ఉండంటంతో సిమ్రన్ సింగ్‌ది హత్యా లేక ఆత్మహత్య అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిమ్రన్ సింగ్‌ను ఆమె భర్తే చంపేసాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేశారు.సిమ్రన్ గతంలో సంబలపురి ఆల్బమ్స్ సెల్ఫీ బెబో, రిక్షా వాలా, రిమ్ జిమ్, మోర్ గర్ల్ ఫ్ర్డెండ్ 2, దిల్ క రాజా, డిజే బాబు రిటర్న్ వంటి వాటిల్లో నటించి పాపులర్ అయ్యింది. అయితే ఆమె మరణించడానికి కొన్ని గంటల ముందు ఓ వాయిస్ రికార్డు బయటికి వచ్చింది.
ఈ వాయిస్ రికార్డులో తాను మానసికంగా చాలా అలిసిపోయానని, త్వరలో ఈ ప్రపంచాన్ని వీడిపోతున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తన భార్య మరణించిందని పోలీసులు చెప్పేవరకు తనకు తెలియదని అంటున్నాడు సిమ్రన్ సింగ్ భర్త.తను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, దానికి రెండు వైపుల పెద్దలు ఇష్టపడలేదని వేరేగా ఉంటున్నామని అన్నారు. అయితే గత కొంతకాలంగా తమ మధ్య విభేధాలు వచ్చి వేరుగా ఉంటున్నామని తెలిపాడు.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’