Friday, April 26, 2024
- Advertisement -

రెండో వివాహం చేసుకుంటే మరణ శిక్ష..!

- Advertisement -

చైనాలో ఆర్థిక నేరాలకు పాల్పడిన ఓ సంస్థ మాజీ అధినేతకు మరణశిక్ష విధించింది ఆ దేశ న్యాయస్థానం. అవినీతి సహా రెండో వివాహం చేసుకున్న కేసులో చైనా హురంగ్​ అసెట్​ మేనేజ్​మెంట్​ కో లిమిటెడ్ మాజీ అధినేత లై జియామిన్​​కు ఈ శిక్ష విధించింది రెండో మునిసిపల్​ ఇంటర్మీడియట్​ పీపుల్స్​ కోర్ట్​ ఆఫ్​ టియాంజిన్. అతని రాజకీయ హక్కులు రద్దు చేయడమే కాకుండా.. ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

2008 నుంచి 2018 వరకు పలు కీలక పదవుల్లో విధులు నిర్వహించిన లై అవినీతికి పాల్పడినట్లు కోర్టు నిర్ధరించింది. 1.78 బిలియన్​ యువాన్ల (దాదాపు 276 మిలియన్ డాలర్లు) అక్రమాలకు పాల్పడినట్లు తేల్చింది.

జియామిన్​పై 2018లో అవినీతి కేసులో దర్యాప్తునకు ఆదేశించింది అధికార కమ్యూనిస్ట్ పార్టీ. అదే ఏడాది పార్టీ నుంచి బహిష్కరించింది.

లాక్ డౌన్ చాలా నేర్పించింది : రవితేజ

ఏ రాష్ట్రానికి ఎన్ని ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చారంటే…!

టాటా కారు నంబర్ తో ఓ మహిళ రశీదుల పర్వం..?

అతివలకి గొప్ప ఉద్యోగ అవకాశం.. ఇదే తొలిసారి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -