Sunday, April 28, 2024
- Advertisement -

ప్రముఖ నటి సుధాచంద్రన్ ఇంట విషాదం..

- Advertisement -

తెలుగులో ‘మయూరి’ చిత్రంతో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నటి సుధాచంద్రన్. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఆమె తర్వాత బుల్లితెరపై తన సత్తా చాటారు. నటి, డ్యాన్సర్ గా సుధాచంద్రన్ నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డట్టు పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. తాజాగా సుధాచంద్రన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. సుధా చంద్రన్ తండ్రి.. ప్ర‌ముఖ న‌టుడు కేడీ చంద్ర‌న్ (84) కన్నుమూశారు.

గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.. ఈ నేపథ్యంలో మే 12న ముంబ‌యిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన గుండెపోటు రావడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ‘హ‌మ్ హయిన్ ర‌హీ ప్యార్ కే’, ‘చైనా గేట్’, ‘తేరే మేరే స‌ప్నే’, ‘హ‌ర్ దిల్ జో ప్యార్ క‌రేగా’, ‘కోయీ మిల్ గయా’ తదిత‌ర చిత్రాలతో నటుడిగా కేడీ చంద్ర‌న్ గుర్తింపు సంపాదించుకున్నారు. గుల్మోహ‌ర్ అనే టీవీ షోతోనూ ప్రేక్ష‌కుల్ని అల‌రించారు.

ఇక కేడీచంద్ర‌న్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. భరతనాట్యం డ్యాన్సర్​ అయిన సుధాచంద్రన్​ తన డ్యాన్స్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇదే క్రమంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో నటించారామె. ప్రస్తుతం పలు టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు.

టాలీవుడ్‌ను పక్కన పెట్టేసిన శ్రద్ధ శ్రీనాథ్.. నిజమేనా?

క‌రోనాతో కోలీవుడ్ నటుడు కన్నుమూత

ఇంద్రభవనంలాంటి సమంత ఇల్లు.. మీరు ఎప్పుడైన చూశారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -