టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు తమిళ భాషలలో ఎన్నో అవకాశాలను దక్కించుకుని దూసుకుపోతున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడుతూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు.
ప్రస్తుతం పూజాహెగ్డే ప్రాజెక్ట్ చేస్తున్నారంటే దానికోసం 3 కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోందని సమాచారం. సీనియర్ హీరోయిన్ నయనతారకు పోటీగా పూజా హెగ్డే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ సినిమాలలోకి రాకముందు మోడల్ గా పని చేసేది.
మొట్టమొదటిసారిగా ఈ బుట్ట బొమ్మ హీరో జీవాతో కలిసి “మూగ ముడి” అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో నటించినందుకు గాను ఈమెకు మొదటి పారితోషికంగా 30 లక్షల రూపాయలను తీసుకున్నారు.ఈ విధంగా తను సంపాదించిన మొదటి పారితోషకాన్ని BMW5 సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును కొనుగోలు చేసిందంట. ఇప్పటికీ ఆ కారు తనతోనే ఉంది. మొదటి సంపాదనతో కొన్న కార్లు కావడంతో ఆ కారు అంటే తనకెంతో ఇష్టమని ఈ బుట్ట బొమ్మ చెప్పుకొచ్చింది.
బిగ్ బాస్ కంటెస్టెంట్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు