Saturday, April 20, 2024
- Advertisement -

ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ అర్జీవి లాజిక్స్..?

- Advertisement -

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మా ఎన్నికల వేడి రాజుకుంటోంది. రోజురోజుకు ఈ ఎన్నికల గురించి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మా అధ్యక్ష పదవికి ఎన్నికల పోటీలో భాగంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ప్రకాష్ రాజ్ మంచి దూకుడు పై ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోని మంచు విష్ణు సైతం పదవి కోసం పావులు కదుపుతున్నారు. ఎలక్షన్ల కోసం ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే కొందరు ప్రకాష్ రాజ్ నాన్ లోకల్.. అధ్యక్షుడు ఎలా అవుతారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలబడ్డారు. ఈ విషయంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ… తెలుగు చిత్ర పరిశ్రమలో తొమ్మిది నందులు, జాతీయ అవార్డులు వచ్చినప్పుడు, గ్రామాలను దత్తత తీసుకున్నపుడు నేను నాన్ లోకల్ కాదు.. అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి నాన్ లోకల్ అంటున్నారంటూ ప్రకాష్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ సైతం ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలబడ్డారు.

Also read:టీచర్ జాబ్ సంపాదించిన మలయాళ బ్యూటీ!

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద దర్శకుడిగా పేరు పొందిన రామ్ గోపాల్ వర్మ సైతం ఈ విషయంపై స్పందించి తనదైన శైలిలో కామెంట్లు చేశారు… కర్ణాటక నుంచి వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్లోకల్ అయితే? గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు …బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు,తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా ? అంటూ ప్రశ్నించారు. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి ఎక్కడికో వెళ్లిన రజనీకాంత్, ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు వెళ్ళిన అమితాబచ్చన్ నాన్ లోకలా… ప్రకాష్ రాజ్ నటన చూసి నాలుగు సార్లు భారతదేశం అతనికి శాలువా కప్పి సత్కరించింది. ఆయనని నాన్లోకల్ అంటే అది ఇండియాకు వ్యతిరేకం అంటూ తనదైన శైలిలో ఆర్జీవి చురకలు అంటించి వరస పోస్టులు చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also read:త్వరలోనే శివతో సూర్య సినిమా.. ఎప్పుడొస్తుందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -