Friday, March 29, 2024
- Advertisement -

ఉత్కంఠకు తెర.. టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం

- Advertisement -

ఎన్నో నెలలుగా నలుగుతున్న టీ పీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఎట్టకేలకు భర్తీ చేసింది. అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది. పీసీసీ అధ్యక్షుడితో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులను, ఉపాధ్యక్షులను కూడా నియమించింది. మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్​ను ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్​గా నియమితులయ్యారు. మహ్మద్​ అజహరుద్దీన్​, గీతారెడ్డి, అంజన్​ కుమార్​ యాదవ్​, జగ్గారెడ్డి, మహేశ్​ కుమార్​ గౌడ్​లను వర్కింగ్​ ప్రెసిడెంట్లుగా నియమితులయ్యారు.

చంద్రశేఖర్​ సంబాని, దామోదర్​రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేశ్​ షెట్కర్​, వేం నరేందర్​రెడ్డి, రమేశ్​ ముదిరాజ్​, గోపిశెట్టి నిరంజన్​, టి. కుమార్​ రావు, జావేద్​ అమీర్​లను సీనియర్​ ఉపాధ్యక్షులుగా నియమించారు. ప్రచార కమిటీ కన్వీనర్​గా సయ్యద్​ అజ్మతుల్లా, హుస్సేనీలను ఎంపిక చేశారు. ఎన్నికల మేనేజ్​మెంట్​ చైర్మన్​గా దామోదర రాజనర్సింహను ఎంపిక చేసింది. ఏఐసీసీ ప్రోగ్రామ్​ అమలు కమిటీ చైర్మన్​గా అల్లేటి మహేశ్వర్​రెడ్డిని నియమించింది.

పీసీసీ అధ్యక్షుడి రేసులో ముందు నుంచి రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. అయితే మరో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పోటీలోకి రావడంతో పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై తర్జనభర్జనలు జరుగుతూ వచ్చాయి. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటిస్తే కోమటిరెడ్డి తో పాటు మరికొందరు సీనియర్లు పార్టీని విడిచి వెళ్లి పోయే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ నియామక ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది.

సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులవుతారంటూ వార్తలు రావడంతో వీహెచ్ వంటి సీనియర్ నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. సీనియర్ నాయకులను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తి ని ఎలా నియమిస్తారు అని ఆయన ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తనకు పీసీసీ ఇవ్వాలని కోరడంతో అధిష్ఠానం అధ్యక్షుడి నియామకంపై వెనకడుగు వేసింది. మధ్యేమార్గంగా జీవన్ రెడ్డికి పీసీసీ అప్పగిస్తారని కూడా వార్తలు వచ్చాయి. అది కూడా కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డిని తాత్కాలికంగా పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించారు.

ఆ తర్వాత సీనియర్ నేత జానారెడ్డి సాగర్ ఉప ఎన్నిక తర్వాత నియామకాలు చేపట్టాలని కోరారు. దీంతో కొద్దిరోజులు పీసీసీ ఎంపిక వాయిదా వేశారు. ఇటీవల మళ్లీ పలుమార్లు టీ పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తున్నారంటూ వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు.
ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఏదైనా ఒక రాష్ట్రానికి నూతన సీఎంను నియమించడానికి కూడా ఎప్పుడూ ఇంత సమయం తీసుకొని ఉండదేమో.పార్టీ రాష్ట్ర ఇన్చార్జి తో అన్ని జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపి వారి సలహాలు తీసుకొని కూడా ప
పీసీసీ అధ్యక్షుడి నియామకం లో పార్టీ అధిష్ఠానం ఎనలేని జాప్యం చేసింది. ఇవాళ పీసీసీ మహిళా అధ్యక్షురాలిని నియమించిన అధిష్ఠానం ఆ వెంటనే టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో కొన్ని నెలల నిరీక్షణ అనంతరం ఉత్కంఠకు తెరపడింది. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితాన్ని టీఆర్ఎస్ తో ప్రారంభించినా , ఆయనకు గుర్తింపు మాత్రం టీడీపీలోనే దక్కింది. అక్కడే కీలక నేతగా ఎదిగారు. రాష్ట్ర విభజనతో విధిలేని పరిస్థితుల్లో ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కూడా నాయకుడిగా కొన్ని రోజులకే చక్కటి గుర్తింపు తెచ్చుకొని ఎన్నికలకు ముందు పార్టీ వర్కింగ్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. కేసీఆర్ వంటి బలమైన నేతను ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి సరైన నాయకుడు అని భావించిన ఏఐసీసీ పీసీసీ పీఠాన్ని ఆయనకే అప్పగించింది.

Also Read

టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా సునీతా రావు.. !

ఏపీ సీఎస్​గా సమీర్​ శర్మ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -