Wednesday, May 7, 2025
- Advertisement -

కాటమరాయుడు పక్కా హిట్.. ఎందుకంటే..?

- Advertisement -
Power Star follow Mega Star

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా కాటమరాయుడు. డాలీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శృతీహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒకట్టి అడ్డక్కి వస్తునే ఉంది. మొదట ఈ సినిమాకి ఎస్ జే సూర్య దర్శకత్వం వహిస్తాడని చెప్పి.. సడెన్ గా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ సినిమా డాలీ చేతికి వెళ్లింది. అంతేకాకుండా ఈ సినిమాపై అనుకున్న స్థాయిలో బ‌జ్ లేదు. అయితే ఈ సినిమాని వచ్చే నేలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

రిలీజ్ దగ్గర పడుతుండటంతో సినిమాపై హైప్ పెంచారు. ఇటివలే రిలీజ్ చేసిన టీజర్ తో అంచనాలు భారీ పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా ఆడియో వేడుక జరపకుండా డైరెక్ట్ గా పాటలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 పాటలు కూడా డైరెక్ట్ గా రిలీజ్ చేసి.. తర్వాత ప్రీ రిలీజ్ పంక్షన్ చేసారు. ఇప్పుడు పవన్ కూడా అన్నయ్యను ఫాలో అవుతున్నాడు. కాటమరాయుడు మూవీ సాంగ్స్ ను డైరెక్ట్ గా రిలీజ్ చేసి.. ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

గతంలో అల్లు అర్జున్.. సరైనోడు, మెగా పవర్‍స్టార్ రామ్ చరణ్ ధృవ.. సినిమాల సాంగ్స్ ఒక్కో పాట‌ను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసి త‌ర్వాత గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ సినిమాల‌న్ని సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక రీసెంట్‌గా మ‌రో మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ విన్న‌ర్ సినిమాకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. మ‌రి అన్న చిరుతో పాటు మిగిలిన మెగా హీరోల సెంటిమెంట్ ప‌వ‌న్‌కు క‌లిసొచ్చి కాట‌మ‌రాయుడు హిట్ అవుతుందా… అయితే పవన్ అభిమానులు మాత్రం కాట‌మ‌రాయుడు పక్కా హిట్ అని అంటున్నారు.

{youtube}uiAGRzRMADg{/youtube}

Related

  1. పవన్ “కాటమరాయుడు” కథ ఇదే…
  2. పవన్ కాటమరాయుడు టీజర్ అదిరింది!
  3. అల్లు అర్జున్ డీజే పోస్టర్ లో పవన్ కళ్యాణ్
  4. అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ ఘోరమైన కామెంట్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -