Sunday, May 19, 2024
- Advertisement -

ప్రభాస్ ఎక్కువ ఎందుకు డబ్బు ఖర్చు పెడుతాడో తెలుసా..?

- Advertisement -
Prabhas most expensive possession is a sand volleyball court

ప్రభాస్ కు ఇప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూత్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ తో ప్రభాస్ కు సంబంధించిన చిన్న వార్త అయిన కూడా భారీ క్రేజ్ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలో ప్రభాస్ కు సంబంధించి వ్యక్తిగత అంశాలు ఆసక్తులపై ఓ పత్రికలో ఆసక్తికరమైన కథనం వచ్చింది. ఇందులో కీలక అంశం ఏదైనా ఉందంటే…అది ప్రభాస్ ప్రత్యేకంగా వ్యక్తిగత ఆసక్తుల గురించి.

ప్రభాస్ తన కెరీర్ ద్వారా సంపాదించుకున్న వాటిలో ఆయన ఎక్కువగా ఖర్చు చేసేది కార్లు బంగళాల కోసం కాదట. ఎక్కువగా ఖర్చుపెట్టింది వాలీబాల్ కోర్ట్ కోసమట. ఔట్ డోర్ స్పోర్ట్స్ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడే ప్రభాస్ సొంతంగా హైదరాబాద్ లోనే సాండ్ వాలీబాల్ కోర్ట్ నిర్మించుకున్నారు. ప్రభాస్ తన సమయాన్ని ఎక్కువగా స్నేహితులతో కలిసి సాండ్ వాలీబాల్ కోర్టులోనే గడుపుతారని తన సమయాన్ని-ఎనర్జీని ఇక్కడే ఖర్చు చేస్తారని పేర్కొంది. ‘నాకు వాలీబాల్ ఆడటం అంటే చాలా ఇష్టం.

{loadmodule mod_custom,Side Ad 1}

సమయం చిక్కినప్పుడల్లా తన స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడటానికే సమయం కేటాయిస్తాను` అని ఇటీవల ఇంటర్వ్యూలో ప్రభాస్ పేర్కొన్న విషయాన్ని వివరించారు. ఇక ప్రభాస్కు ఉన్న మరో ఆసక్తి ట్రెక్కింగ్. దీంతో పాటుగా రాక్ క్లైంబింగ్ అంటే కూడా ప్రభాస్ కు ఇష్టమట. బాహుబలి-2లో ప్రభాస్ అంత ఫిట్ గా ఉండటానికి రాక్ క్లైబింగ్ కూడా ఎంతో తోడ్పడిందని విశ్లేషించింది. ఇక ప్రభాస్ మంచి చదువరి అని కూడా ఈ కథనం వివరించింది. తన ఇంట్లో ప్రభాస్కు సొంత లైబ్రరీ ఉందని ఎన్నో గొప్ప పుస్తకాలకు ఈ లైబ్రరీ వేదిక అని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ప్రభాస్ ఇతరులతో మాట్లాడే విషయంలో ప్రభాస్ కొంచెం సిగ్గరి అని వివరించింది.

{youtube}U-cJoLWIOdg{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్రభాస్, షర్మిల మధ్య లింక్ ఏంటి..? షర్మిల చెప్పిన నిజాలు ఇవే
  2. ప్రభాస్ సెక్సీగా ఉంటారని.. మనసులో మాట బయటపెట్టిన అనుష్క
  3. రాజకీయాల్లోకి రాబోటున్న ప్రభాస్..?
  4. ప్రభాస్‌కు ఎన్ని వేల మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ వచ్చాయో తెలిస్తే కళ్ళు తిరుగుతాయి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -