Sunday, May 19, 2024
- Advertisement -

బాబ్రీ మ‌షీదు విధ్వంసం కేసులో అద్వానీ,ముర‌ళీమ‌నోహ‌ర్ జోషీపై మ‌రిన్ని అభియేగాలు

- Advertisement -
Advani may face CBI court more charges in Babri case

భాజాపా కుర‌వృద్దుడు ఎల్ .కె. అద్వానీని బాబ్రీ మ‌షీదు విధ్వంసం కేసు వెంటాడుతోంది.బాబ్రీ కూల్చివేత అంశంలో వీరిపై ఉన్న నేరపూరిత కుట్ర ఆరోపణలను 2011లో అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేయగా… దాన్ని సుప్రీంకోర్టు గత నెలలో పునరుద్ధరించడం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ కేసులో ప్రధాననిందితుడైన ఆయనపై లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉందన్న మాట చెబుతున్నారు.దీంతో అద్వానీ చుట్టూ బాబ్రీమ‌షీదు ఉచ్చు మ‌రింత బిగుసుకుంటోది.
వివాదాస్పద కట్టడం కూల్చివేతకు సంబంధించిన కుట్ర ఆరోపణల్ని 2011లో అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. అయితే.. ఈ కేసును గత నెలలో సుప్రీంకోర్టు తిరగతోడటంతో ఇప్పుడీ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లైంది. దాదాపు ఆరేళ్ల కిందట కింది కోర్టు కొట్టేసిన కేసును తిరిగి తెరిచిన కారణంగా.. తాజాగా ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

{loadmodule mod_custom,Side Ad 1}
ఈ ఉదంతంలో అద్వానీతో పాటు బీజేపీ నేతలు మురళీమనోహర్ జోషి.. ఉమాభారతి తదితరులు మీద కూడా సరికొత్త అభియోగాలు మోపే అవకాశం ఉందని చెబుతన్నారు.
సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారిస్తూ.. ఈ కేసులో వాదనలు ప్రతి రోజూ వినాలని.. విచారణను నెల రోజుల్లో మొదలెట్టి.. రెండేళ్ల లోపు ముగించాలంటూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది.తాజా పరిణామాలు బీజేపీ కురువృద్ధుడికి చిక్కులు తెచ్చేలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.

Also read

  1. రెండు వేర్వేరు చోట్ల రూ..82 కోట్ల విలువైన పాముల విషం స్వాధీనం
  2. ప్ర‌మాదంనుంచి తృటిలో త‌ప్పించుకున్న మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌
  3. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు ఉండ‌ద‌ని ప‌రోక్షంగా చెప్పిన భాజాపా ఛీప్‌ అమీత్‌ షా
  4. క‌య్యానికి కాలు దువ్వుతున్న భార‌త్‌….పాక్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -