Friday, May 17, 2024
- Advertisement -

ప్రభాస్‌కు ఎన్ని వేల మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ వచ్చాయో తెలిస్తే కళ్ళు తిరుగుతాయి..

- Advertisement -
Prabhas Turned Down 6000 Marriage Proposals

బాహుబలి సినిమాతో ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనకర్లేదు. ఈ సినిమాతో సూపర్ స్టార్ గా మారిపోయారు. ఒకప్పుడు తెలుగులో మాత్రమే పరిమతమైన ప్రభాస్ ఛరిష్మా ఇప్పుడు దేశమంతటా మారుమోగుతోంది. అతన్ని జాతీయ స్టార్‌గా నేషనల్‌ మీడియా ఆకాశానికెత్తుతుండగా.. ప్రభాస్ మాత్రం తాను అంత పెద్ద స్టార్ ని కాదని అంటున్నాడు.

ఇంకోవైపు ప్రభాస్ గురించి.. అతని లైఫ్ గురించి.. సినీ కేరీర్ గురించి.. ఇష్టాయిష్టాల గురించి పలు ఆసక్తికర విషాయాలను జాతీయ మీడియాలో  హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్ కు అక్షరాల ఆరువేల మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ వచ్చాయట. కానీ బాహుబలి ప్రాజెక్టు మీద ఫోకస్‌ కొనసాగించేందుకు ఈ ప్రతిపాదనలన్నింటినీ డార్లింగ్‌ వదిలేసుకున్నాడని తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. ఇక బాహుబలి 2 షూటింగ్ సందర్భంగా.. ఓ సంస్థకు ప్రచారకర్తగా ఉండాలంటూ.. రూ. 10 కోట్ల ఆఫర్‌ ప్రభాస్‌కు వచ్చింది.

కానీ బాహుబలి నుంచి దృష్టి మళ్లించడం ఇష్టం లేక ఆ ఆఫర్ ను వదిలేసుకున్నాడు ప్రభాస్. అది ఆయన అంకితభావానికి నిదర్శనం. ప్రభాస్ కు మొదటి నుంచి అయిన కొంచెం సిగ్గు ఎక్కువ.. ఆడంబరాలకు దూరంగ లో- ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంటాడు. అంతేకాకుండా ప్రభాస్ మంచి ప్రకృతి ప్రేమికుడు.. సమయం దొరికినప్పుడల్ల పుస్తకాలు చదువుతాడు. ఏదైన పని చేస్తే… ఆ పని మీదనే నిబద్ధత ఎక్కువ ఉంటుంది. బాహుబలి మూవీలో శివుడి పాత్ర కోసం 82 కిలోల నుంచి 87 కిలోల వరకు బరువు పెరిగిన ప్రభాస్‌.. అదే బాహుబలి కోసం105 కేజీల వరకు బరువు పెరిగాడు. బాహుబలి ప్రాజెక్టు కోసం ప్రభాస్‌ దాదాపు ఐదేళ్లు కేటాయించాడు. 600 రోజులు షూటింగ్‌ లో పాల్గొన్నాడు.

{youtube}zDp7wEt-gyw{/youtube} 

Related

  1. ప్రభాస్‌తో 5 కోట్లు ముద్దు.. కాని ఆ హీరోతో ముద్దుకు నో రెమ్యూనరేషన్‌
  2. ప్రభాస్‌, అనుష్క ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు.. ఎప్పుడంటే..?
  3. ప్రభాస్‌ను చూసి భయపడ్డ చిరంజీవి
  4. ప్రభాస్‌ ‘బాహుబలి’కి తీసుకున్న మొత్తం పారితోషికం ఎంతంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -