Tuesday, April 30, 2024
- Advertisement -

“ప్రాజెక్ట్ కే” మామూలుగా ఉండదట!

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వచ్చిన రాధేశ్యామ్ తో నిరాశపరిచినప్పటికి, పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక తన అప్ కమింగ్ మూవీస్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరిలో ” ఆది పురుష్ ” మూవీ తో ప్రభాస్ సందడి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద మారుమ్రోగేది. కానీ ఆది పురుష్ గ్రాఫిక్స్ పై తీవ్రమైన విమర్శలు రావడంతో బెటర్ అవుట్ పుట్ కోసం మూవీని వచ్చే ఏడాది జూన్ కు వాయిదా వేసింది చిత్రాయూనిట్.

దాంతో ఇక అందరి చూపు సలార్ పై పడింది. కే‌జి‌ఎఫ్ సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృస్తించిన ప్రశాంత్ నీల్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండడంతో సలార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ తరువాత పాన్ వరల్డ్ స్థాయిలో ” ప్రాజెక్ట్ కే ” మూవీ చేస్తున్నాడు ప్రభాస్. ఇంతవరకు ప్రభాస్ నటించని ఒక సరికొత్త కథాంశంతో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. దాంతో నాగ్ అశ్విన్ ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ అభిమానుల్లో విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఆ మద్య మూవీ కి సంబంధించిన ఓ హ్యాండ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది చిత్రా యూనిట్.

ఆ పోస్టర్ ను బట్టి మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్ అని అంచనా కు వచ్చారు అభిమానులు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ” ప్రాజెక్ట్ కే ” మూవీకి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్..” ప్రాజెక్ట్ కే చాలా కొత్త స్టోరీ అని, అలాగే దాన్ని తెరకెక్కించే విధానం కూడా చాలా కొత్తగా ఉండబోతుందని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. ఈ మూవీ ఎలా చేయాలో అనే ఆ ఇమాజినేషన్ కే చాలా టైమ్ పడుతుడని, ఈ మూవీ కోసం అన్నీ తయారు చేసుకోవాలని, ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ మూవీ ఒక విజువల్ వండర్ లా ఉండబోతుందనేది అర్థమైంది. మరి నాగ్ అశ్విన్ ఎలాంటి విజువల్ వండర్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

“ఆదిత్య 999 ” పక్కా.. బాలయ్య క్లారిటీ !

స్టార్ హీరోలే విలన్లు.. ఆ డైరెక్టర్ అంతే !

చిరు బాలయ్యకు స్ట్రోక్ ఇస్తోన్న తలపతి విజయ్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -