చిరు బాలయ్యకు స్ట్రోక్ ఇస్తోన్న తలపతి విజయ్ ?

Thalapathy Vijay, Balakrishna and Chiranjeevi, to come together in the Biggest Clash
Thalapathy Vijay, Balakrishna and Chiranjeevi, to come together in the Biggest Clash

2023 సంక్రాంతి రేస్ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ వారి వారి సినిమాలతో పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ వాల్తేరు వీరయ్య తో రేస్ లో ఉంటే.. బాలయ్య తన ఫ్యాక్షన్ మూవీ వీర సింహారెడ్డి తో రేస్ లో నిలిచారు. ఇక వీరిద్దరితో పాటు నేషనల్ స్టార్ ప్రభాస్ కూడా ” ఆది పురుష్ ” తో రేస్ లో ఉన్నప్పటికి.. మూవీ క్వాలిటీ విషయంలో రిలీజ్ వాయిదా వేయాల్సి వచ్చింది. .

ఇక మన తెలుగు స్టార్స్ తో పాటు తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ కూడా ” వారసుడు ” మూవీతో సంక్రాంతి పై కన్నేశాడు. దాంతో చిరు బాలయ్య విజయ్ ల మద్య సంక్రాంతి ఫైట్ రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ మూడు సినిమాలు కూడా బడా మూవీస్ కావడంతో థియేటర్స్ సమానంగా దక్కే అవకాశం ఉందా ? లేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే చిరు బాలయ్య మూవీస్ తో పోలిస్తే విజయ్ వారసుడు మూవీకే థియేటర్స్ ఎక్కువ దక్కే ఛాన్స్ ఉందట.

ఎందుకంటే ఆ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మిస్తుండడం.. ఏపీ లోని దాదాపు చాలా థియేటర్స్ దిల్ రాజు అధీనంలో ఉండడంతో అధిక థియేటర్స్ విజయ్ మూవీకే కేటాయించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఇటీవల జరిగిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యత తగ్గించాలని ప్రొడ్యూసర్స్ అందరూ ఒక తీర్మానానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికి దిల్ రాజ్ కు డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ లో స్ట్రాంగ్ బేస్ ఉన్న కారణంగా మెజారిటీ థియేటర్స్ లో వారసుడు ప్రదర్శించే విధంగా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. ఇదే గనుక జరిగితే చిరు బాలయ్య మూవీస్ ని వెనక్కి నెట్టి ఒ తమిళ్ హీరో మూవీ తెలుగులో అధిక థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కు విజయ్ ఛాన్స్ ఇచ్చాడా ?

అల్లు అర్జున్ కోసం రాసిన కథలో ఎనర్జీటిక్ హీరో ?

ఎన్టీఆర్ కొరటాల మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ?