Friday, April 19, 2024
- Advertisement -

ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ షురూ…!

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మరో పాన్ ఇండియన్ మూవీ రాధేశ్యామ్. ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా జరుగుతోంది. నిజానికి ఈ సినిమా సాహో కంటే ముందే మొదలైంది. కానీ ప్రభాస్ ఈ మూవీ పక్కన పెట్టి సాహోను పూర్తి చేశాడు. బాహుబలి సినిమా టైం నుంచి డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఈ మూవీపైనే వర్క్ చేస్తున్నాడు. సాహో పూర్తయిన తర్వాత కూడా ఈ సినిమా షూటింగ్ వేగం అందుకోలేదు. ఇక కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా మూవీ షూటింగ్ మరింత డిలే అయ్యింది.

ఎట్టకేలకు ఇవాళ రాధే శ్యామ్ మూవీ షూటింగ్ ప్రారంభం తిరిగి కావడంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాధే శ్యామ్ చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. ఇక్కడే నాలుగు రోజులపాటు ప్యాచ్ వర్క్ లో భాగంగా కొన్ని టాకీ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత ప్రభాస్, పూజ హెగ్డేపై ఓ సాంగ్ షూట్ చేయనున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది.

రాధే శ్యామ్ కు హిందీలో మిథున్, మనన్ సంగీతం అందిస్తుండగా, తెలుగులో మాత్రం జస్టిన్ ప్రభాకరన్ పాటలు అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదలపై ఇప్పటి దాకా క్లారిటీ లేదు. దసరా సీజన్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. రాధే శ్యామ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ తన తదుపరి సినిమాలైన ఆదిపురుష్, సలార్ మూవీల షూటింగ్ సమాంతరంగా చేయనున్నాడు.

Also Read

మరోసారి నితిన్ తో జతకట్టనున్న రష్మిక..!

ఈ సారైనా నిధి ఫేట్ మారుతుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -