Thursday, April 25, 2024
- Advertisement -

సూపర్ హీరో కాన్సెప్ట్ తో ‘హను -మాన్’ ప్రారంభం

- Advertisement -

తన తొలి సినిమా ‘అ’తోనే అబ్బురపరిచాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తన తొలి చిత్రాన్నే వైవిధ్యంగా మలిచి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తన రెండో సినిమాగా రాజశేఖర్ హీరోగా తీసిన కల్కి సినిమాతో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రశాంత్ వర్మ తన మూడో సినిమాగా తొలిసారి ఇండియాలోనే జాంబీ జానర్ లో తెరకెక్కించిన జాంబి రెడ్డి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో పాటు ఒక ప్రత్యేకమైన సినిమాగా పేరు తెచ్చింది.

ప్రశాంత్ వర్మ తన నాలుగో సినిమాకు కూడా మరోసారి తన ప్రత్యేక పంథాను ఎంచుకున్నాడు. తెలుగులో మొట్టమొదటి సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రశాంత్ వర్మ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు హనుమాన్ అనే పేరు పెట్టాడు. జాంబి రెడ్డితో హీరోగా మారిన తేజ సజ్జ తోనే తన తదుపరి సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఎంతో శక్తివంతుడైన హనుమాన్ పేరు పెట్టుకోవడం, సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది.

హనుమాన్ సినిమా ఈ రోజు షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ భారీ బడ్జెట్ తో తీయడమే కాకుండా, గ్రాండ్ వీఎఫ్ ఎక్స్, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ తో తెరకెక్కించనున్నట్లు సమాచారం. జాంబి రెడ్డితో మంచి పేరు తెచ్చుకున్న యువ హీరో తేజ సజ్జకు ఈ మూవీ కీలకంగా మారనుంది.

Also Read

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా లైన్లోనే.. ఆగిపోలేదట..!

ఎఫ్​3లో ప్రగ్యా జైస్వాస్​ స్పెషల్​ సాంగ్​..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -