Wednesday, May 15, 2024
- Advertisement -

ప్రభాస్ ను ఇంటికి పంపించిన రాజమౌళి!

- Advertisement -
prabhas wraps up baahubali shoot finally

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు మూడున్నరేళ్లుగా బాహుబలి సినిమాకే పరిమితమైపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న బాహుబలి రెండో భాగం లో ప్రభాస్ నటించే సీన్స్ కంప్లీ కావడంతో ప్రభాస్ ను ఇంటికి పంపిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సంగతిని బాహుబలి చిత్ర అఫీషియల్ పేజ్లో ప్రకటించారు. ఈ చిత్రంలో నటించిన ఇతర నటీనటులందరూ బాహుబలి చిత్రం తో పాటు వేరే చిత్రాల్లో కూడా నటించారు.

కానీ ప్రభాస్ మాత్రం మరో చిత్రం సైన్ చేయకుండా బాహుబలికే పరిమితమయ్యాడు. చిత్రంలో కీలక పాత్ర కావడం వల్ల భారీ కండలు, పొడవాటి జుట్టుతో మహారాజులా మారిపోయాడు ప్రభాస్. ఆ లుక్ వల్ల ఇతర సినిమాలు చేయలేకపోయాడు. కేవలం బాహుబలి చిత్రం కోసమే శారీరకంగా, మానసికంగా విపరీతమైన శ్రమ పడటంతో గ్యాప్ వచ్చిన సినిమాలు చేసేందుకు ప్రభాస్ ఆసక్తికనబరచలేదు. ఇప్పుడు బాహుబలి రెండో భాగం కూడా కంప్లీట్ కావడంతో ప్రభాస్ కూడా ఇక నార్మల్ లుక్ లో కనిపించనున్నాడు.

త్వరలోనే రన్ రాజా రన్ ఫేం సుజిత్ డైరెక్షన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రభాస్ నటించబోతున్నాడు. మూడేన్నరేళ్ల పాటు బాహుబలి సినిమా కోసం త్యాగం చేసిన ప్రభాస్ కు డైరెక్టర్ రాజమౌళి కృతజ్ఞతలు తెలిపాడు. ఒక నరకం లాంటి ప్రయాణాన్ని కొనసాగించినందుకు థ్యాంక్స్ డార్లింగ్ అంటూ ట్వీట్ చేశాడు. బాహుబలి ప్రాజెక్ట్ ను నువ్వు నమ్మినంతగా మరెవ్వరూ నమ్మలేదంటూ ప్రభాస్ త్యాగాన్ని కష్టాన్ని ఆకాశానికి ఎత్తేశాడు రాజమౌళి.

Related

  1. అల్లు అర్జున్ కి తలనొప్పిగా మారిన ప్రభాస్!
  2. అయ్యో.. పవన్ , ప్రభాస్ లకు ఇది నింజంగా చేదు వార్తే
  3. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో చెప్పిన ప్రభాస్
  4. నితిన్ మంచి ప్రేంఢ్… ఐ లవ్ ప్రభాస్- గుత్తా జ్వాల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -