Saturday, May 18, 2024
- Advertisement -

పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో చెప్పిన ప్రభాస్

- Advertisement -
prabhas revealed secrets of his life partner

టాలీవుడ్ లో సీనియర్ బ్యాచిలర్ గా పిలివదగ్గ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాతో ప్రపంచ మొత్తం అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. ఈ ఏడాది 37వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు ప్రభాస్. బాహుబలి సినిమా మొదలు పెట్టక ముందే పెళ్లి చేయడానికి ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు అంతా ఏర్పాట్లు చేశారు.

అయితే చరిత్ర సృష్టించగల కథ కావడంతో, అందుకోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో డార్లింగ్ పెళ్లిని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు బాహుబలి కంక్లూజన్ కూడా కంప్లీట్ కావబోతుంది. ఇక ఆలస్యం చేసేది లేదని ప్రభాస్ కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. అందుకు ఆయన కూడా ఒకే చెప్పారు. రీసెంట్ గా ప్రభాస్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి మిత్రులతో చెప్పుకున్నారంట.

వైజాక్ లో స్థిరపడిన కుటుంబానికి చెందిన ఆమె తన కోసం మూడేళ్లు ఎదురుచూసిందని, ఆమె మంచి రూపవతి అని, ఎక్కువగా చదువుకుందని స్నేహితులతో వెల్లడించారు. గౌరవం కలిగిన కుటుంబం కావున నిక్షితార్ధం కాక ముందే ఆమె పేరు చెప్పడానికి నిరాకరించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఇరుకుటుంబాల సభ్యులు కలుసుకొని పెళ్లి గురించి చర్చించుకోనున్నట్లు సమాచారం.

Related

  1. ప్రభాస్ తన తర్వాత సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
  2. నితిన్ మంచి ప్రేంఢ్… ఐ లవ్ ప్రభాస్- గుత్తా జ్వాల
  3. ప్రభాస్ ఇంటి గురించి వివరాలు!
  4. వామ్మో ఆకాశంలో 30 కోట్లు ఎగరేసిన ప్రభాస్‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -