Friday, April 19, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్‌లో చాలా మార్పు వచ్చింది: ప్రకాష్ రాజ్

- Advertisement -

రీసెంట్ గా వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో సూపర్ హిట్ కొట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కొట్టడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేస్తున్నారు. దీంతో ఇందులో నటించిన నివేద థామస్ నుంచి ప్రకాష్ రాజ్ వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ సంభాషణ సోషల్ మీడియాలో ప్రేక్షకులను బీభత్సంగా ఆకట్టుకుంటుంది. అయితే ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ కలిసి సుస్వాగతం, బద్రి, కెమెరామెన్‌ గంగతో రాంబాబు, జల్సా చిత్రాల్లో నటించారు. అయితే బద్రి సినిమాలో ”నువ్వు నంద అయితే నేను బద్రి.. బద్రీనాథ్” అనే డైలాగ్ ఇప్పటికి ప్రేక్షకులలో క్రేజ్ తగ్గలేదు.

ఇప్పుడు ప్రకాష్ రాజ్ మళ్లీ నంద పాత్రలో నటించడంతో భారీస్థాయిలో హైప్ వచ్చింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్. పవన్ కెరీర్ ప్రారంభంలో చాలా తక్కువ మాట్లాడేవారు అని.. చాలా సిగ్గు పడేవారని.. అప్పట్లో కేవలం నటన మాత్రమే తన పని అనుకునేవారు.. కానీ ఇప్పుడు అయన నటుడిగా ఎంతో ఎదిగారు అంటూ చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్

పవన్ కళ్యాన్ కి కరోనా పాజిటీవ్…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -