పవన్ కళ్యాన్ కి కరోనా పాజిటీవ్…

- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కరోనా వైరస్ సోకినట్లు స్వయంగా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం తన వ్యవసాయం క్షేత్రంలో పవన్ కళ్యాణ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్న పవన్ కు తాజాగా పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 3న తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్ చేరుకున్న తరవాత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు పవన్ కళ్యాణ్ కరీనా పరీక్షలు చేయించుకున్నారని.. అయితే అప్పుడు ఫలితం నెగిటివ్ వచ్చినట్లు వివరించాయి.

అయినప్పటికీ మరోసారి ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. పవన్‌కు పాజిటివ్ ఫలితం వచ్చిందని జనసేన పార్టీ ప్రకటించింది. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు,కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్‌కు వచ్చి పవన్‌కు చికిత్స ప్రారంభించారని, ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నట్లు వివరించాయి.

- Advertisement -

కాాాగా, వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత మూవీ యూనిట్‌లో ఒక్కొక్కరుగా కరోనా బారిన పడ్డారు. అయన వ్యక్తిగత సిబ్బందిలో కొంత మందికి కోవిడ్ సోకడంతో క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇప్పుడు పాజిటివ్‌గా తేలడంతో.. పవన్ తన ఫామ్ హౌజ్‌లో చికిత్స పొందుతున్నారు.

వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త లేఖ హల్ చల్..!

తెలంగాణ లో మళ్ళీ లాక్ డౌన్ చర్చ.. చివరికి ఏమైంది అంటే..!

కోలీవుడ్ కమెడియన్ కి సీరియస్.. ఐసీయూలో చికిత్స!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -