Thursday, March 28, 2024
- Advertisement -

జనసేన కి ‘గాజుగ్లాసు’ గుర్తు క్యాన్సిల్..!

- Advertisement -

తెలంగాణ మినీ పురపోరులో జనసేన తన గాజుగ్లాసు గుర్తును కోల్పోయింది. పుర ఎన్నికల్లో 10 శాతం సీట్లలోనూ పోటీ చేయనందున గుర్తు తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. తెలంగాణ‌లో పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీల్లో జ‌న‌సేన పోటీ చేసే య‌త్నం చేసింది. అందుకోసం త‌మ‌కు కామ‌న్ సింబ‌ల్ కావాల‌ని, త‌మ పార్టీ గ‌తంలో పొందిన గాజుగ్లాసునే కేటాయించాని ఆ రాష్ట్ర ఎస్ఈసీని కోరింద‌ట ఆ పార్టీ.

అయితే .. జ‌న‌సేన ట్రాక్ రికార్డును బ‌ట్టి ఆ పార్టీకి కామ‌న్ సింబ‌ల్ ద‌క్క‌ద‌ని ఎస్ఈసీ స్ప‌ష్టం చేసిన‌ట్టుగా తెలుస్తోంది. బిజేపితో పొత్తు వల్ల గత ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పిన జనసేన.. వరంగల్, ఖమ్మం సహా మిగిలిన చోట్లా పోటీ చేస్తామని తెలిపింది. ఎప్పుడో తోచిన‌ప్పుడు ఎన్నిక‌ల్లో పోటీ చేసే వాళ్ల‌కు ప‌ర్మినెంట్ గుర్తులు ఉండ‌వు అని సీఈసీ స్ఫ‌ష్ట‌మైన సందేశాన్ని ఇచ్చింది.

తిరుప‌తి ఉప ఎన్నిక‌లో అవ‌కాశం ఉన్నా పోటీ చేయ‌లేదు. అంత‌కు ముందు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ పోటీ చేయ‌లేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని గ్లాసు గుర్తును తొలగిస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తామని, గుర్తును కొనసాగించాలని జనసేన కోరగా.. ఎస్ఈసీ తిరస్కరించింది. 

నేటి పంచాంగం, శనివారం(17-04-2021)

అలాంటి టాటూతో షాకిచ్చిన రేణూ దేశాయ్?

ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -