Saturday, April 20, 2024
- Advertisement -

నైట్ కర్ఫ్యూ ఉన్నా.. నడిరోడ్డుపై డ్యాన్స్ చేసింది.. అడ్డంగా బుక్ అయ్యింది!

- Advertisement -

దేశంలో ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ తో కేసుల సంఖ్య లక్షల్లో చేరుతుంది. మరణాల సంఖ్య వేలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వారాంతం లాక్ డౌన్ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అధికారులు సైతం కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ కు చెందిన ఓ యువతి, తన అత్యుత్సాహంతో కర్ఫ్యూ సమయంలో నడిరోడ్డుపై డ్యాన్స్ పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యింది.

ఈ ఘటన రాజ్ కోట్ లో జరిగింది. ప్రిషా రాథోడ్ అనే యువతి ఈవెంట్ మేనేజ్ మెంట్ జాబ్ లో ఉంటూ, సోషల్ మీడియాలో తన వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తుంది. తానో వీడియోను మరింత వినూత్నంగా చేయాలని భావించిన ఆమె, రాత్రి 11 గంటల సమయంలో ఓ ఇంగ్లీష్ పాటకు నడిరోడ్డుపై డ్యాన్స్ చేస్తూ, ఆ వీడియోను పోస్ట్ చేసింది.

అప్పటికే వీడియో వైరల్ కాగా, పలువురు ఆమె నిబంధనలను ఉల్లంఘించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. తాను ఆ వీడియో డిలీట్ చేశానని చెబుతుంది.. అప్పటికే పలువురు దాన్ని షేర్ చేయండంతోనే అది వైరల్ అయిందని ఆమె వివరణ ఇచ్చినా, పోలీసులు తమ పనిని తాము చేసుకుని వెళ్లారు. ఇటువంటి తుంటరి పనులు చేస్తే, చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలన్నీ పాటించాల్సిందేనని పేర్కొన్నారు.

నేటి పంచాంగం, శనివారం(17-04-2021)

అలాంటి టాటూతో షాకిచ్చిన రేణూ దేశాయ్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -