ఎఫ్​3లో ప్రగ్యా జైస్వాస్​ స్పెషల్​ సాంగ్​..

- Advertisement -

అనిల్​ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్​2 సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిందే. పెళ్లి తర్వాత ఎదురయ్యే ఇబ్బందులను.. ఎంతో ఫన్నీగా తెరకెక్కించారు ఈ సినిమాలో.. ముఖ్యంగా భార్య బాధితులకు ఈ మూవీ బాగా కనెక్ట్​ అయి ఉంటుంది. ఇక వెంకటేశ్​, వరుణ్​తేజ్​ మధ్య వచ్చిన కామెడీ సీన్స్​ ఎంతో ఆకట్టుకున్నాయి. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కూడా మంచి కామెడీ తో అలరించారు.

అయితే ఎఫ్​ 2 సక్సెస్​ కావడంతో దానికి సీక్వెల్​ తీయాలని ఫిక్స్​ అయ్యాడు దర్శకుడు అనిల్​ రావిపూడి.. కథ నచ్చడంతో వెంకటేశ్​, వరుణ్​ తేజ్​ ఒప్పుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్​ మొదలుకాగా.. కరోనా ఎఫెక్ట్​తో ఆగిపోయింది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్​ బయటకు వచ్చింది. ప్రగ్యా జైస్వాల్​ ఈ సినిమాలో ఓ స్పెషల్​ సాంగ్​లో నటించబోతున్నట్టు టాక్​. ప్రగ్యాతోపాటు సోనాల్‌ చౌహన్‌ ఐటమ్​ సాంగ్​లో నటించబోతున్నట్టు టాక్​.

- Advertisement -

త్వరలోనే ఇందుకు సంబంధించిన షూటింగ్​ను స్టార్ట్​ చేయబోతున్నారు. సీనియర్ నటి సంగీత కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుందట. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేశ్​ దృశ్యం 2 రీమేక్​లో సైతం నటిస్తున్నాడు. మరోవైపు ఆయన నటించిన నారప్ప సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. వరుణ్ తేజ్ ఎఫ్- 3 సినిమాతో పాటు గని అనే సినిమాలో నటిస్తున్నారు.

Also Read

ఎన్టీఆర్, చరణ్ ల మీద సాంగ్.. చిత్రీకరణకే 20 రోజులు..!

175 కోట్ల రూపాయిల ఇల్లు.. ప్రియుడి కోసమే కొన్న హీరోయిన్!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -