Friday, April 19, 2024
- Advertisement -

నాని ‘టక్ జగదీశ్’ మూవీ రిలీజ్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ

- Advertisement -

గత ఏడాది నుంచి కరోనా కష్టకాలం మొదలైన విషయం తెలిసిందే. ఆ మద్య కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్, థియేటర్ల ఓపెనింగ్ కి పరిమిషన్ ఇచ్చారు. దాంతో చిన్నా పెద్ద చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అంతలోనే కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో మళ్లీ వాయిదాల పర్వం మొదలైంది.

ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ‘టక్ జగదీష్’ సినిమా రూపొందింది. సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవరించారు. నాని సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ మూవీ గత నెలలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది. దాంతో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

తమకి అలాంటి ఆలోచన లేదని నిర్మాతలు స్పష్టం చేశారు కూడా. అయితే ప్రచారాలు మాత్రం అస్సలు ఆగడం లేదు.. దాంతో నిర్మాతలు మళ్లీ రంగంలోకి దిగవలసి వచ్చింది. ‘టక్ జగదీశ్’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ఉద్దేశం లేదనీ, థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో మరో ముఖ్య పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు.

బంపర్ ఆఫర్ కొట్టేసిన యాంకర్ రష్మి

హనుమంతుని జన్మస్థలంపై చర్చల్లో ప్రతిష్టంభన!

జూనియర్‌ డాక్టర్ల చర్చలు సఫలం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -