Friday, April 26, 2024
- Advertisement -

‘ఉస్తాద్’ గా ముందుకొస్తున్న రామ్..!

- Advertisement -

దేవదాస్, రెడీ, నేను శైలజ వంటి సినిమాలతో రామ్ పోతినేని సూపర్ హిట్లు అందుకున్నప్పటికీ అతడి స్థాయిని పెంచింది మాత్రం ఇస్మార్ట్ శంకర్. రామ్ కెరీర్లో సాలిడ్ మాస్ హిట్ గా ఇస్మార్ట్ శంకర్ నిలబడింది. కెరీర్లో ఎన్నో ప్రేమ కథా చిత్రాలు హిట్ అయి తెచ్చిన పేరు కంటే ఇస్మార్ట్ శంకర్ వంటి ఒక్క మాస్ హిట్ తో రామ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఇక వరుసగా మాస్ సినిమాలు చేయాలని రామ్ నిర్ణయించుకున్నాడు.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే మాస్ మూవీ కూడా రామ్ చేశాడు. అది సరైన ఫలితం ఇవ్వకపోయినప్పటికీ మరోసారి మాస్ సినిమానే ఎంచుకున్నాడు రామ్. ఈ సారి మాస్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లింగస్వామి తో రామ్ జతకట్టాడు. లింగస్వామి తమిళ్ లో మాధవన్ కు రన్, విశాల్ కు పందెంకోడి వంటి మాస్ హిట్లు ఇచ్చాడు. మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న రామ్ లింగస్వామి తో కొత్త సినిమా చేస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో రామ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నట్లు టాక్. రామ్ ఇదివరకు ఎప్పుడూ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించలేదు. ఈ సినిమాలో రామ్ పాత్రను లింగస్వామి మాస్ గా తీర్చిదిద్దినట్లు టాక్. కాగా ఈ సినిమాకు ఉస్తాద్ అనే పేరు పెట్టాలని మేకర్స్ నిర్ణయించారని సమాచారం. ఇస్మార్ట్ శంకర్ మూవీ లో రామ్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అంటూ పదేపదే డైలాగ్ చెబుతుంటాడు. దీంతో ఉస్తాద్ అనే టైటిల్ ఈ సినిమాకు బాగుంటుందని మేకర్స్ భావించి దానికే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ పై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రామ్ కు లింగుస్వామి మరో మంచి మాస్ హిట్ ఇస్తాడేమో వేచి చూడాలి.

Also Read

సత్యదేవ్​ సినిమా ఈ సారి ఓటీటీలో కాదు.. డైరెక్ట్​గా థియేటర్​లోనే..!

టాప్ గేర్ లో దూసుకెళ్తున్న కృతి శెట్టికి బాలీవుడ్ ఆఫర్..!

రిలీజ్ కి రెడీగా ఉన్న మహాసముద్రం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -