Wednesday, May 7, 2025
- Advertisement -

బాహుబలిలో రాజమౌళి నచ్చిన పాత్ర ఏదో తెలుసా..?

- Advertisement -
Rajamouli Favourite role in Baahubali Movie

‘బాహుబలి’ సినిమా అనగానే.. అందులోని విజువల్ ఎఫెక్ట్స్.. వార్ సీన్స్.. అదనపు ఆకర్షణల గురించే మాట్లాడుకుంటారు. కానీ అందులో ఉన్న బలమైన పాత్రలు ఉన్నాయి. అందులో పాత్రలు పోషించినా నటీనటులందరూ అద్భుత అభినయం ప్రదర్శించారు. మరి వీళ్లందరిలో ది బెస్ట్ ఎవరు అంటే.. ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

కొందరు ప్రభాస్ ది బెస్ట్ అంటారు.. ఇంకొందరు రమ్యకృష్ణే నంబర్ వన్ అంటారు. ఇంకొందరికి రానా నచ్చుతాడు. మరికొందరికి సత్యరాజే బాగా నచ్చాడు. మరి దర్శకుడు రాజమౌళి దృష్టిలో ‘బాహుబలి’లో అత్యుత్తమంగా నటించింది ఎవరు.. అంటే ఆయన ‘నాజర్’ అని సమాధానం ఇచ్చాడు.. బాహుబలి సినిమాలో మిగతా వాళ్లందరికీ బలమైన పాత్రలు దక్కాయని.. నాజర్ క్యారెక్టర్ మాత్రమే వీక్ అని అన్నాడు రాజమౌళి. మిగతా నటీనటులందరూ కూడా చాలా బాగా నటించారని.. ఐతే అందరిలో ఒకరిని ఎంచుకోమంటే తాను నాజర్ కే ఓటు వేస్తానని రాజమౌళి తెలిపాడు.నాజర్ పాత్ర అంత బలంగా ఏమీ ఉండదని… ఆ పాత్ర లేకపోయినా సినిమాలో తేడా ఏమీ ఉండదని జక్కన్న అన్నాడు. బిజ్జాల దేవ పాత్ర వెయిట్ తక్కువైనప్పటికీ.. నాజర్ తన నటనతో ఆ పాత్రను నిలబెట్టాడని.. ప్రతి సన్నివేశంలోనూ ‘నేనున్నాను’ అనిపించేలా నటించాడని అన్నాడు రాజమౌళి.

{loadmodule mod_custom,Side Ad 2}

అందుకే నాజర్ ‘ది బెస్ట్’ అంటానని అన్నాడు. మామూలుగా రానా.. అనుష్క నటన పరంగా కొంచెం వీక్ అయినప్పటికీ ‘బాహుబలి’లో మాత్రం చాలా బాగా నటించారని.. ముఖ్యంగా దేవసేన మహిష్మతి రాజ దర్బారులోకి ప్రవేశించాక వచ్చే సన్నివేశంలో ఇద్దరూ చాలా బాగా చేశారని.. రానా ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా నాజర్ మీద చేయి వేస్తూ.. తీస్తూ హావభావాలు పలికించే సన్నివేశంలో అదరగొట్టాడని రాజమౌళి తెలిపాడు.

{youtube}s13zJNkuxiE{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బాహుబలి 2 బద్దలు కొట్టిన రికార్డులు ఎన్నో తెలుసా..?
  2. బాహుబలి సినిమాలో నటులు నుదుటి పై పెట్టుకున్న బొట్ల వెనుక అసలు సీక్రెట్ ఇదే
  3. బాహుబలి నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
  4. ‘బాహుబలి’కి కొట్టేందుకు.. మరో భారీ సినిమా…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -