Sunday, May 19, 2024
- Advertisement -

బాహుబలి సినిమాలో నటులు నుదుటి పై పెట్టుకున్న బొట్ల వెనుక అసలు సీక్రెట్ ఇదే

- Advertisement -
Bahubali Stars Interest Creates

తెలుగు దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎలాంటి రికార్డులు సొంతం చెసుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కోసం రాజమౌళి యూనిట్ పడ్డ కష్టాన్ని మంచి ఫలితం దక్కింది. కథ, కథనం, సంగీతం, ఫోటోగ్రఫీ, ఫైట్స్, ఆర్ట్ వంటి అంశాల్లోనే కాకుండా ఈ సినిమాలోని నటీనటులు దరించిన దుస్తులు, నుదట పెట్టుకున్న బొట్లు పై కూడా దర్శకుడు రాజమౌళి లోతుగా వెళ్ళి తెలుసుకొని ఆ నటినటులకు ఆ బొట్లు ను పెట్టారు.

దీనికి కారణం ఈ సినిమాలో ఆ పాత్రలు నుదుట పెట్టిన బోట్లే. ప్రతి పాత్రకు పెట్టిన బొట్టు వెనక ఎవరికి తెలియని సీక్రెట్ దాగి ఉంది. ఇప్పుడు ఆ సీక్రెట్ ఏంటో చూద్దాం..

శివగామి : ఈ సినిమాలో శివగామి నిండు చంద్రుడు కలిగిన బొట్టు పెట్టుకొని ఉంటుంది. అంటే దానికి అర్ధం.. . ధైర్యానికి, సాహసోపేత నిర్ణయాలకు, భద్రత, ఆప్యాయతలు, అనురాగం, ప్రేమకు నిదర్శనం. అందుకే ఆ పాత్రకు తగ్గట్లుగా బొట్టు పెట్టారు.

{loadmodule mod_custom,Side Ad 1}

అమరేంద్ర బాహుబలి : ఈ సినిమాలో బాహుబలికి సగం చంద్రుడి బొట్టు పెట్టారు. శివగామి వంటి వ్యక్తిత్వంతో పాటు మరికొన్ని మంచి సుగుణాలు కలిగివుంటారు. ప్రజల పట్ల కరుణ, జాలి చూపిస్తారు. ప్రశాంతమైన మనసుతో ఉంటారు. అందుకే సగం బొట్టు. ‘మగధీర’ సినిమాలో  రామ్ చరణ్ కూడా ఇలాంటి బొట్టునే పెట్టుకుంటాడు.

మహేంద్ర బాహుబలి : ఈ బొట్టుకు అర్ధం.. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ చూపడం.. అందర్నీ శాసించేవారై.. ఎంతో బలవంతులుగా ఉంటారట. అందుకే బాహుబలి లో శివుడు పాత్రకు ఆ బొట్టు పెట్టారట.

దేవసేన : బాహుబలిలో దేవసేన పెట్టుకున్న బొట్టు లింగ వివక్షకు వ్యతిరేకం. మగా, ఆడ ఇద్దరూ సమానమేనని తెలిపేలా పెట్టారు. నుదట పెట్టుకున్న బొట్టు కూడా స్త్రీపురుషుడు కలిసివున్నట్టుగా ఉంటుంది.

భళ్లాలదేవ : బాహుబలి లో భళ్లాలదేవ సూర్యడి బొట్టు పెట్టుకొని ఉంటాడు. అంటే ఎన్ని సంవత్సరాలైనా సూర్యుడు ఒకేలా ఉంటాడు. అలాగే, భళ్లాల దేవుడు కూడా ఎప్పటికీ అదే బలం, రాజసం కలిగి ఉంటాడు.

{loadmodule mod_custom,Side Ad 1}

బిజ్జాలదేవ : ఈ సినిమాలో బిజ్జాలదేవ త్రిశూలం గుర్తుతో ఉన్న బొట్టు పెట్టుకొని ఉంటాడు. మనషుల్లో ఉండే మూడు గుణాల్లో సత్య, రజో, తామస గుణాల్లో మూడోదైన తామస గుణాన్ని ఈ పాత్రధారి ప్రతిబింభిస్తాడు. అసమతుల్యత, రోగం, గందరగోళం, తొదరపాటు, మోసం, అసూయ, ద్వేషం వంటి వ్యక్తిత్వాలను ప్రతిబింభిస్తుంది. అందుకే త్రిశూలం బొట్టును పెట్టారు

కట్టప్ప : కట్టప్ప పెట్టుకున్న బొట్టు బానిసత్వానికి గుర్తు. నిస్సహాయతకు ప్రతీక. అందుకే కట్టప్ప పాత్రకు ఆ బొట్టు పెట్టారు.

అవంతిక : బాహుబలిలో అవంతిక పాత్రకు పెట్టిన బొట్టుకు అర్ధం ప్రతీకారం కోసం, ఓ ఆయుధంగా మారుతుందని దాని అర్థం.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బాహుబలి నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
  2. ‘బాహుబలి’కి కొట్టేందుకు.. మరో భారీ సినిమా…
  3. పవన్ కళ్యాణ్ ఒక బాహుబలి.. రాజమౌళి దర్శకత్వం పక్కా..?
  4. బాహుబలికి ఈ పాపకు మధ్య సంబంధం ఏంటో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -