Friday, March 29, 2024
- Advertisement -

‘అన్నాత్తే’ రజినీ వర్కింగ్ స్టిల్ వైరల్‌!

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. ఐదు నెలల క్రితం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న సమయంలో హఠాత్తుగా రజినీ ఆరోగ్యం పాడవడంతో చెన్నై వెళ్లిపోయారు. ఈ మద్యలోనే ఆయన రాజకీయ ప్రస్థావన రావడం తనకు రాజకీయాలు వద్దు అనడం జరిగిపోయింది.

ఆ తర్వాత తమిళనాట ఎన్నికలు రావడం జరిగింది. ఇటీవల ఎన్నికలు ముగిశాయి.. ఇఫ్పుడు రజినీ మళ్లీ హైదరాబాద్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా ‘అన్నాత్తే’ షూటింగ్ స్పాట్ లో రజినీకాంత్, దర్శకుడు శివ కలిసి ఉన్న ఒక పిక్ ను షేర్ చేశారు నిర్మాతలు.

ఈ పిక్ లో రజినీకాంత్ తెల్లని చొక్కా, పంచ ధరించి స్టైలిష్ గా కన్పిస్తున్నారు.  శివ దర్శకత్వం వహిస్తున్న ‘అన్నాత్తే’లో నయనతార, కీర్తీ సురేష్, ఖుష్బూ, మీనా కీలక పాత్రలు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబరు 4న ఈ సినిమా విడుదల కానుంది.

ముచ్చటగా మూడో వాక్సిన్.. ఇంత మందికి దక్కినో..!

అందరూ బాగుండాలని కోరుకున్న రాష్ట్రపతి..!

మూడు చుట్టూ తిరుగుతున్న తెలంగాణా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -