Wednesday, May 8, 2024
- Advertisement -

ముచ్చటగా మూడో వాక్సిన్.. ఇంత మందికి దక్కినో..!

- Advertisement -

రష్యా వ్యాక్సిన్​ స్పుత్నిక్​-వి అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి లభించింది. ఈ టీకాపై మనదేశంలో డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీస్​ క్లినికల్​ పరీక్షలు నిర్వహించింది. టీకాకు అనుమతుల విషయంపై సోమవారం భేటీ అయిన నిపుణుల కమిటీ డీసీజీఐకు సిఫార్సు చేసింది.

కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ రెండూ భారత్‌ తయారీ వ్యాక్సిన్లు కాగా.. స్పుత్నిక్‌ వీ మాత్రం రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్. డీజీసీఐ అనుమతి లభిస్తే దీన్ని రష్యా నుంచి భారత్‌కు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.ప్రస్తుతం భారత్‌లో అత్యవసర వినియోగానికి కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌లను అనుమతించారు.

ఇప్పుడు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీని కూడా అనుమతిస్తే భారత్‌లో అనుమతించిన మూడో వ్యాక్సిన్ కానుంది.దేశంలో టీకాల కొరత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్పుత్నిక్​-వి టీకాను ఇప్పటికే అనేక దేశాల్లో వినియోగిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలను వినియోగిస్తున్నారు.

నటుడు, నిర్మాత కుమారజన్‌ ఆత్మహత్య

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

నేటి పంచాంగం, మంగళవారం (13-04-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -