Friday, March 29, 2024
- Advertisement -

రజనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..! తలైవా మూవీ థియేటర్లోకి వచ్చేది అప్పుడే..!

- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం అన్నాత్తే. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అయినప్పటికీ కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. అయితే కొద్ది రోజుల కిందట హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రజినీకాంత్ కు సంబంధించిన సన్నివేశాలను కంటిన్యూ గా చిత్రీకరించారు. ప్రస్తుతం రజనీకాంత్ వైద్య చికిత్సల కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే ఆయన మూడు నెలల పాటు ఉండనున్నారు.

అమెరికా పర్యటనకు వెళ్లక ముందే రజినీకాంత్ తన వెర్షన్ కు సంబంధించి షూటింగ్ పూర్తి చేశాడు. డబ్బింగ్ కూడా చెప్పాడు. ఇటీవల దర్శకుడు సిరుతై శివ మిగిలిన షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేశాడు. కాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి క్లారిటీ వచ్చింది. ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, ఖుష్బూ, మీనా, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, కీర్తి సురేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు శివ తమిళ టాప్ హీరో అజిత్ తో వీరమ్, వేదాళం, విశ్వాసం తీసి వరుసగా హిట్లు కొట్టాడు. రజినీతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. మరి రజినీకి శివ ఎలాంటి హిట్ ఇస్తాడో లేదో చూడాలి.

Also Read: ఏ హీరోలకు తగ్గేదేలా.. బన్నీ నుంచి మరో పాన్ ఇండియా మూవీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -