Friday, May 3, 2024
- Advertisement -

Rajini vs Ajith: రజనీకాంత్​ వర్సెస్​ అజిత్​.. దీపావళి కి బిగ్​ఫైట్​

- Advertisement -

తమిళ అగ్రహీరోలు రజనీకాంత్​,అజిత్​ సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నాయి. దీపావళికి వీళ్లు నటించిన సినిమాలు రాబోతున్నాయి. ఇద్దరూ అగ్రహీరోలు కావడం.. భారీ బడ్జెట్​ సినిమాలు కావడంతో అంచనాలు కూడా భారీగా నెలకొన్నాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరి సినిమా పై చేయి అవుతుందో .. వేచి చూడాలి.

రజనీకాంత్ నటించిన అన్మాత్తే.. దీపావళికి విడుదల కాబోతున్నది. సన్​పిక్చర్స్​ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇక శివ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార హీరోయిన్​గా చేస్తోంది. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
అజిత్ హీరోగా నటిస్తున్న వలిమై కూడా కూడా దీపావళికే రాబోతున్నట్టు టాక్​. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హెచ్. వినోద్ దర్శకత్వం లో వహిస్తున్నారు.

Also Read: వనితా వర్సెస్​ రమ్యకృష్ణ.. ఏమిటీ పంచాయితీ?

బోని కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. యామి గౌతమ్, తెలుగు నటుడు కార్తికేయ ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక రజనీకాంత్​, అజిత్​ ఇద్దరూ మాస్​ హీరోలే. ఇద్దరికీ తమిళనాట భారీ మార్కెట్ ఉంటుంది. ఇక అభిమానులు వారి హడావుడి మామూలుగా ఉండదు. దీంతో ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: మాస్​ డైరెక్టర్​తో విజయ్​ దేవరకొండ మూవీ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -