Saturday, April 20, 2024
- Advertisement -

Vanitha vs Ramya: వనితా వర్సెస్​ రమ్యకృష్ణ.. ఏమిటీ పంచాయితీ?

- Advertisement -

వనితా విజయ్​కుమార్​ ఓ వివాదాస్పద నటి. తన పెళ్లిళ్లు, ప్రేమ వ్యవహారాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక పెళ్లి, ప్రేమ అనేది వ్యక్తిగత విషయం అయినప్పటికీ.. సినీ సెలబ్రిటీల విషయంలో ఇది మీడియాకు పెద్ద వార్త.. ఇదిలా ఉంటే ఇటీవల వనితా విజయ్​ కుమార్​ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ రియాల్టీ షో విషయంలో సీనియర్​ నటి రమ్యకృష్ణతో ఆమె గొడవ పడ్డారు. స్టార్​ విజయ్​ టీవీ ‘బిగ్​బాస్ జోడిగల్​’ అనే ఓ రియాల్టీ షోను నిర్వహిస్తోంది. ఈ షోలో వనితా మరికొందరు పాల్గొంటున్నారు. ఇక ఈ షోకు రమ్యకృష్ణ హోస్ట్​గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల ఈ షోనుంచి వనితా అర్ధాంతరంగా తప్పుకున్నది.

అంతేకాక ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఓ సీనియర్​ నటి ప్రవర్తన వల్లే తాను ఈ షోనుంచి తప్పుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ షోలో భాగంగా ఓ స్కిట్​కు వనితా విజయ్​కుమార్​ పర్​ఫామెన్స్​కు హోస్ట్​ రమ్యకృష్ణ 10 మార్కులకు గానూ ఒక్క మార్కు వేశారు. దీంతో వనితా బాగా హర్ట్​ అయినట్టు సమాచారం.

Also Read: ఇండియన్​ -2 వివాదంలో కీలక మలుపు.. కోర్టు ఏం చెప్పిందంటే?

అయితే ఈ విషయంపై ఓ మీడియా సంస్థ రమ్యకృష్ణను ప్రశ్నించారు. దీనిపై రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ’ షోలో ఏం జరిగిందో మీరు వనితను కూడా అడిగితే బాగుంటుంది’ అంటూ సమాధానం చెప్పారు రమ్యకృష్ణ. మొత్తానికి ప్రస్తుతం ఈ వివాదం హాట్​ హాట్​గా మారింది. వనితా విజయ్​ కుమార్​ బిగ్​బాస్​ షోతో పాపులర్​ అయ్యారు. ఇక ఆమె తన వ్యక్తిగత విషయాలు, కామెంట్లతో నిత్యం మీడియాలో కనిపిస్తూ ఉంటారు.

Also Read: ఏ హీరోలకు తగ్గేదేలా.. బన్నీ నుంచి మరో పాన్ ఇండియా మూవీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -