Friday, April 19, 2024
- Advertisement -

బీస్ట్​లో షారూఖ్​.. అంచనాలు ఏ రేంజ్​లో ఉంటాయో?

- Advertisement -

ఇళయ దలపతి విజయ్​.. నెల్సన్​ దిలీప్​ కుమార్​ దర్శకత్వంలో బీస్ట్​ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్​కు తమిళనాడులో ఏ రేంజ్​లో మాస్​ ఫాలోయింగ్​ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన బీస్ట్​ ఫస్ట్​లుక్​ అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక బుట్టబొమ్మ పుజాహెగ్డే ఈ చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్​డేట్​ ఓ సంచలనంగానే మారింది.

ఈ మూవీలో బాలీవుడ్​ అగ్రనటుడు షారూఖ్​ఖాన్​ అతిథి పాత్రలో చేయబోతున్నట్టు టాక్​. ఇక షారూక్​ నటిస్తే ఈ మూవీ రేంజ్​ మరింత పెరుగుతుందని ఫ్యాన్స్​ భావిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త తమిళమీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను పాన్​ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు. తెలుగులో పేరు మారుస్తారా? లేక ఇదే పేరుతో విడుదల చేస్తారా? వేచి చూడాలి.

Also Read: ‘ఐకాన్’ తో సుకుమార్ కు భలే చిక్కొచ్చి పడిందే..!

విజయ్ కి తెలుగులోనూ మంచి మార్కెట్​ ఉంది. తాజాగా ఈ మూవీలో షారూఖ్​ నటిస్తుండటంతో బాలీవుడ్​లోనూ మంచి మార్కెట్​ సొంతం చేసుకోవడం ఖాయమని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక షారూఖ్​ ఖాన్​ ఎటువంటి పాత్ర చేయబోతున్నారు? అన్న విషయం వేచి చూస్తూనే తెలుస్తుంది.

Also Read: పవన్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న హరీష్ శంకర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -