Friday, May 9, 2025
- Advertisement -

బాబా రాందేవ్‌, విరుష్క దంప‌తుల‌కు రాఖీ సావంత్ స‌వాల్‌

- Advertisement -

ఇటీవ‌ల కండోమ్ యాడ్స్ ప్ర‌ద‌ర్శ‌న‌ను టీవీల్లో ఉద‌యం 6 నుంచి రాత్రి 10 గంట‌ల (ప్రైమ్ టైమ్‌) వ‌ర‌కు నిలిపివేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యంపై కేంద్ర ప్రసార – సమాచార శాఖకు – కేంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి – కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీకి రాజస్థాన్ హైకోర్టు నోటీసులు పంపింది. ఎందుకు ప్ర‌సారం నిలిపివేయాల‌ని ప్ర‌శ్నించింది. వీటిపై స‌మ‌గ్రంగా తెల‌పాల‌ని హైకోర్టు కోరింది. ఇదిలా కొన‌సాగుతుండ‌గా నిషేధంపై శృంగార తార రాఖీ సావంత్ మండిప‌డుతోంది. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చేస్తున్న ఈ యాడ్ల‌పై నిషేధించ‌డం స‌రికాదు అని అంటోంది.

ఇంకొంచెం మితిమీరి రామ్‌దేవ్ బాబా, అనుష్క శ‌ర్మ‌- విరాట్ కోహ్లీ దంపతుల‌కు స‌వాల్ విసిరింది. రామ్‌దేవ్‌బాబా త‌న ఉత్ప‌త్తులు విరివిగా వ‌స్తుండ‌డంతో ఇప్పుడు ప‌తాంజ‌లి కండోమ్స్ తీసుకురావాల‌ని కోరింది. ప్రముఖ యోగా గురు – పతాంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా 2014 నుంచి తన వ్యాపార సామ్రాజ్యాన్ని రూ.వేల కోట్లకు విస్తరించాడు.ఇటీవ‌ల వివాహం చేసుకున్నభార‌త క్రికెట్ జ‌ట్టు విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శ‌ర్మ జంట‌కు కూడా ఓ స‌వాల్ విసిరింది. తాను ప్రమోట్ చేస్తున్న కండోమ్‌ను విరాట్ కోహ్లీ వాడాల‌ని, వాడిన అనంత‌రం ఎలా ఉందో చెప్పాలని నిస్సిగ్గుగా కోరింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -