Friday, April 26, 2024
- Advertisement -

రామ్ చరణ్ – శంకర్ సినిమా ఫస్ట్ పోస్టర్…

- Advertisement -

తమిళ దర్శకుడు శంకర్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శంకర్​ సినిమాలు అంటేనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. కథ, కథనం, మేకింగ్​ ఇలా అన్నింట్లోనూ కొత్తదనం, భారీ తనం కనిపిస్తుంది. ఇక శంకర్​కు సక్సెస్​ రేటు కూడా చాలా ఎక్కువ. జెంటిల్​మెన్​, భారతీయుడు, ప్రేమికుడు, అపరిచితుడు వంటి చిత్రాలు తెలుగులోనూ సెన్సేషనల్​ క్రియేట్​ చేశాయంటే శంకర్​ రేంజ్​ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే దర్శకుడు శంకర్​ సినిమాలు చాలా ఏళ్ల పాటు చిత్రీకరణ జరుపుకుంటూ ఉంటాయి. కనీసం రెండు లేదా మూడేళ్లపాటు షూటింగ్​ జరుగుతూ ఉంటుంది.

ప్రీ ప్రొడక్షన్, పోస్ట్​ ప్రొడక్షన్​ వర్క్​ కు కూడా చాలా రోజులు తీసుకుంటారు. ఐ, రోబో, రోబో 2.0 సినిమాలు పూర్తవడానికి రెండేళ్ల సమయం పట్టింది. తాజాగా శంకర్​ .. రామ్​ చరణ్​ కాంబినేషన్​లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దిల్​రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శంకర్ మామూలుగానే సినిమా తీయడానికి ఏళ్ళ తరబడి సమయం పడుతుంటుంది.. ఇక ఈ మూవీ పూర్తయ్యే సరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని ఫ్యాన్స్ భావించారు.

కానీ శంకర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం ఆరు నెలల లోపే ఈ చిత్రం షూటింగ్​ ముగించబోతున్నారని సమాచారం. ఇప్పటికే శంకర్​ ప్రీ ప్రొడక్షన్​ పనులు ఎంతో వేగంగా పూర్తిచేశాడట. స్క్రిప్ట్​ కూడా సిద్ధం చేసుకున్నాడట. ఇక హీరోయిన్​గా కియారా అద్వానీని ఎంపిక చేశారు. మ్యూజిక్​ డైరెక్టర్​గా తమన్​ను తీసుకున్నారు. తమన్​ ఇప్పటికే మ్యూజిక్​ కంపోజింగ్​లో బిజీగా ఉన్నాడట. కేవలం ఆరునెలల్లోనే ఈ చిత్రం షూటింగ్​ పూర్తి చేసి విడుదల చేయాలని మేకర్స్​ భావిస్తున్నట్టు టాక్​. శంకర్​ గత చిత్రాల మాదిరే ఆలస్యం చేస్తాడా? లేక తొందరగా పూర్తి చేస్తాడా? అన్నది వేచి చూడాలి.

ఇది ఇలా ఉంటే సినిమా ప్రారంభం సందర్భంగా చిత్రయూనిట్ ఆశ్చర్యకరమైన రీతిలో ఓ ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారాలతో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, కీలకపాత్రధారి సునీల్, ఈ చిత్రానికి పనిచేస్తున్న టెక్నీషియన్లు అందరూ సూట్లు ధరించి దర్శనమిస్తారు. వీ ఆర్ కమింగ్ అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ పెట్టారు.

Also Read: మనసు మార్చుకున్నా మహేష్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -