టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నేడు రానా దగ్గుబాటి వంతు..!

- Advertisement -

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు హైదరాబాదులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో విచారణకు హాజరైన ప్రతి ఒక్కరినీ మరోసారి విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందూలను విచారించిన ఈడీ అధికారులు నేడు దగ్గుబాటి రానాను ప్రశ్నించనున్నారు.

అయితే గతంలో 2017 జరిపిన ఎక్సైజ్‌ విచారణలో రానా,రకుల్‌ల పేర్లు తెరపైకి రాలేదు. అయితే డ్రగ్స్‌ పెడ్లర్‌ కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో వారిద్దరికి నోటీసులు జారీ ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో రకుల్‌ ఈడీ ముందుకు హాజరు అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో హీరో రానా దగ్గుబాటి నేడు ఈడీ ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్‌ వ్యవహారంలో రానాను విచారించనున్నారు ఈడీ అధికారులు. మెదటిసారి సినీతారల డ్రగ్స్ కేసులో రానా విచారణను ఎదుర్కొంటున్నారు.

Also Read: ఈసారి బిగ్ బాస్ 5 టూ…..మచ్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -