Monday, May 13, 2024
- Advertisement -

లోకేష్ ముద్ద‌ప‌ప్పా… అవినీతి ప‌రుడా…

- Advertisement -
lokesh comedy challenge social medai and political parties

ఏపీ రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు కమ్ మంత్రి నారా లోకేశ్ ఈ మధ్య తరచూ వార్తల్లోకి వస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన త‌ర్వాత లోకేష్ చేసిన వ్య‌ఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశాలుగా మారాయి.. ఎప్పుడూ లేని విధంగా చిన్న చిన్న అంశాల విషయంలోనూ ఆయన మాటల్లో తప్పులు దొర్లటం ప్రతిపక్షానికి ఇదో అస్త్రంగా మారింది.దీంతో ప్ర‌తి ప‌క్షాలు… సోషియ‌ల్ మీడియా ఏరేంజ్‌లో ఆడుకున్నారో అంద‌రికి తెలిసిదె. అన్నింటికంటే గూగుల్‌లో ప‌ప్పు అని టైప్ చేస్తే లోకేష్ పేరువ‌స్తుంద‌ని కామెంట్ చేయ‌డంతో ఇన్నాల్లు నిద్ర‌లో ఉన్న లోకేష్ ఎట్ట‌కేల‌కు స్పందించారు.

ఈమ‌ధ్య టీడీపీ ఐటీ వింగ్ అప్ర‌మ‌త్త‌మై గూగుల్ను సంప్ర‌దించి ప‌ప్పు అని టైప్ చేస్తే లోకేష్ రాకుండా చూసుకున్నారు. అక్క‌డ తొల‌గించారు స‌రే ప్ర‌జ‌ల‌మ‌న‌సుల్లోంది లోకేష్‌పై ప‌ప్పు అనేముద్ర‌ను మాత్రం తొల‌గించ‌లేక‌పోయారు.ఇక లోకేష్ అవినీత‌పై విమ‌ర్శ‌లు చెల‌రేగ‌తున్నాయి.ప్ర‌ధాన ప్ర‌త‌ప‌క్ష‌మైన వైసీపీ లోకేష్‌ను ముద్ద‌ప‌ప్పు అనక ఇంకేమ‌నాల‌ని వాదిస్తోంది.ర‌జాధాని భూముల విష‌యంలోను హాయ్‌ల్యాండ్ భూముల విస‌యంలోను లోకేష్ అవినీతికి పాల్ప‌డిన‌ట్లు తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని వంద‌ల కోట్లు సంపాదించార‌ని విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి.

ఇలాంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయంలో లోకేశ్ తో సహా ఎవరికీ పెద్దగా ఐడియా లేదన్న విషయం తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే అర్థమవుతుంది. తన మీద వస్తున్న విమర్శల విషయంలో పంచ్ పడేలా రియాక్ట్ కావాల్సిన లోకేశ్.. సరైన హోం వర్క్ చేయకుండా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడాయన్ను మరింత నవ్వులపాలు చేసేలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది

ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్షాలు తనను పప్పు.. అవినీతిపరుడని విమర్శిస్తున్నాయని.. ఇందులో తాను ఏదో తేల్చి చెప్పాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రెండు వేర్వేరు విమర్శల్లో ఏదో ఒకటే తేల్చాలని కామెడి స‌వాలు విస‌ర‌డంతో మీడియా మిత్రులు త‌ల‌లు ప‌ట్టుకుంట‌న్నారు.లోకేష్ కామెడీ స‌వాల్‌పై నెటిజ‌న్లు రెచ్చిపోతున్నారు. చిన‌బాబు నువ్వు ప‌ప్పు నెండ‌ర్ వ‌న్‌..అవినీతిలో నెంబ‌ర్ వ‌న్ రెండిటిలో నీతో పోటీకి వ‌చ్చేవారు లేరంటూ సెటైర్లు వేస్తున్నారు. లోకేష్‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు ఎలా బ‌దులివ్వాలో తెలియ‌క మ‌రోసారి అడ్డంగా బుక్క‌య్యారు.అయినా గూగుల్ లోనే ప‌ప్పు అని వ‌చ్చిన త‌ర్వాత దానికి క్లారిపికేష‌న్ క‌వాల బాబు.

Related

  1. లోకేష్ ,చంద్రబాబు లపై సంచలన కామెంట్స్ చేసిన కొడాలి నాని..
  2. మంత్రుల ముందు లోకేష్ ఓ రెంజ్ లో సీరియస్ అయిన చంద్రబాబు
  3. 2019 ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ బాహుబ‌లి.. లోకేష్ ఒక క‌మెడియ‌న్
  4. లోకేష్ వచ్చాక టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉందో తెలుస్తే షాక్ అవుతారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -